Tollywood Best Friends: ఎన్టీఆర్, రాజీవ్ కనకాల సహా తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరున్నారంటే.. పార్ట్ -2


Tollywood Best Friends: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ ఒక కవి చెప్పినట్టు కొంత మంది చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటే.. మరికొందరు పెద్ద అయినా తర్వాత ఒకరి భావాలు మరొకొరి నచ్చి స్నేహితులుగా మారతారు. సినీ ఇండస్ట్రీలో కూడా కొందరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. మరికొందరు మాత్రం వృత్తి రీత్యా కలవడంతో స్నేహితులు మారిన వాళ్లు ఉన్నారు. టాలీవుడ్ లో అలాంటి ప్రాణ స్నేహితులు ఎవరున్నారో మీరు లుక్కేయండి..

1 /9

ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

2 /9

రామ్ చరణ్ - శర్వానంద్ రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరి స్నేహం స్కూల్ డేస్ నుంచే మొదలు కావడం విశేషం.

3 /9

రామ్ చరణ్ - రానా రామ్ చరణ్, రానాల మధ్య చిన్ననాటి నుంచే స్నేహం ఉంది. అంతేకాదు వీళ్లిద్దరు కలిసి మెలిసి పెరిగారు.

4 /9

నితిన్ - అఖిల్ నితిన్ అఖిల్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ‘అఖిల్’ సినిమా మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.

5 /9

రానా - నాగ చైతన్య రానా దగ్గుబాటి, నాగ చైతన్య వీళ్లిద్దరు సొంత బావ బామ్మర్దులు. చిన్నప్పటి నుంచే తాత రామానాయుడు ఇంట్లో వీళ్లిద్దరు కలిసి మెలిసి పెరిగారు. అది స్నేహంగా మారింది.

6 /9

సాయి దుర్గ తేజ్ - నవీన్ నరేష్ సాయి దుర్గ తేజ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ ఇద్దరు  జాన్ జిగ్రీ దోస్తులు. వీళ్లిద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా మలుచుకుంటారు.

7 /9

నారా రోహిత్ - శ్రీ విష్ణు నారా రోహిత్, శ్రీ విష్ణు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. శ్రీ విష్ణు సినీ ఇండస్ట్రీలో రావడానికి రోహిత్ సహకారం ఉందనేది అందరు చెప్పుకుంటారు.  

8 /9

జెనీలియా - రామ్ పోతినేని: ‘రెడీ’ సినిమా నుంచి రామ్ పోతినేని, జెనీలియా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న ఇప్పటికీ వీళ్ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.  

9 /9

అల్లరి నరేష్ - నాని: అల్లరి నరేష్, నాని మధ్య కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఒకరి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మరొకరు వెళుతుంటారు.