Janhvi Kapoor in Tirumala: నటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జాన్వీపాప పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
నటి జాన్వీకపూర్ ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. గతేడాది చివరి రోజున సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ చూసిన విషయాన్ని ఇన్ స్టాలో షేర్ చేశారు.
ఇదోక మంచి సినిమా అని.. సాయిపల్లవి నటన చూసి ఎమోషన్ అయినట్లు కూడా..అమరన్ పై ప్రశంసలు కురిపించారు.
అదే విధంగా ప్రస్తుతం జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. ఈ రోజు వీఐపీ బ్రేక్ లో భాగంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు తెలుస్తొంది.
పట్టులంగా వేసుకుని క్యూట్ గా జాన్వీకపూర్ క్యూ లైన్ లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆతర్వాత పండితులు.. జాన్వీకపూర్ కు ప్రత్యేంగా స్వామి వారి ప్రసాదంను అందించినట్లు సమాచారం.
జాన్వీకపూర్ తిరుమల శ్రీవారికి ఎక్కువగా నమ్ముతారంట. అందుకే ఆమె తరచుగా తిరుమలకు వెళ్తుంటారంట. ప్రస్తుతం మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికి జాన్వీకపూర్ మాత్రం తిరుమల వెళ్లడం మాత్రం అస్సలు అవాయిండ్ చేయ్యరంట.
ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. జాన్వీకపూర్ మూవీ తీయనంటూ కాంట్రవర్సీగా మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. జాన్వీకపూర్ కు మాత్రం.. శ్రీదేవీకి మల్లే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తొంది..