Gold Rate Today: బంగారం కొనేవారికి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధర.. లక్ష దాటడం ఖాయం?

 Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్.  కొత్త సంవత్సరంలో స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే నేడు తులం బంగారం ధర భారీగా పెరిగింది. అయితే వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /7

Gold Rate Today: భారత్ లో  బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో బంగారానికి విడదీయరాని బంధం ఉంది. మహిళలు బంగారు నగలు ధరిస్తుంటారు. ఇక పెళ్లిలు, శుభకార్యాల్లో బంగారం  ఉండాల్సిందే.  దీంతో మన దేశంలో ఏడాది పొడవునా బంగారం కొనుగోలు జరుగుతుంటాయి. అయితే ప్రత్యేక సందర్భాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.

2 /7

కేంద్రం సుంకం తగ్గించడంతో బంగారం ధర భారీగానే తగ్గింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. ఇక బంగారం ధర భారీగా తగ్గుతుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి.  

3 /7

2025 లోనైనా ధరలు తగ్గుతాయని గంపెడ ఆశలతో ఎదురుచూసిన బంగారం ప్రియులకు నిరాశ ఎదురవుతుంది. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. జనవరి 10వ తేదీ శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

4 /7

 హైదరాబాద్ మార్కెట్లో ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. క్రితం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయల పెరిగింది. నేడు మరో 350 రూపాయల పెరిగింది. దీంతో తులం బంగారం ధర 72,600 వద్దకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి ఇవాళ 380 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 79200 కు చేరింది. 

5 /7

ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 72750 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర 380పెరిగి 79,350 వద్ద కొనసాగుతోంది.  

6 /7

అయితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అమెరికా సహా పలు దేశాల్లో సంక్షేమం దిశగా అడుగులు వేస్తుండడమే దీనికి కారణం అని చెబుతున్నారు.

7 /7

పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే ఛాన్స్ ఉంటుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి రికార్డ్ ధర దిశగా అడుగులు వేస్తోంది.