Jobs News: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. జిల్లా కోర్టులో ఉద్యోగాలకు భర్తీ.. ప్రతినెల రూ.30 వేల జీతంతో ఉద్యోగం!

Telangana Districts Courts Jobs News: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలుపబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఖాళీ ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే ఇలా తెలుసుకోండి..
 

Telangana Districts Courts Jobs News: తెలంగాణ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలపబోతోంది. రాష్ట్రంలోని హైకోర్టు నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించనంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో గాలి ఉన్న రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులను భర్తీ చేసేందుకు ప్రత్యేకమైన నోటిఫికేషన్ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ నోటిఫికేషన్ లో భాగంగా రాష్ట్ర సర్కార్ కొన్ని అర్హతలు కలిగిన వ్యక్తుల నుంచి మాత్రమే దరఖాస్తును సేకరించబోతున్నట్లు తెలుస్తోంది.

1 /6

ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రతిపాదన కోసం భర్తీ చేయబోతున్నట్లు తెలంగాణ సర్కార్ త్వరలోనే ప్రకటించబోతోంది. అయితే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యా అర్హతలను కూడా గతంలో సూచించింది. దీనికి అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ లో కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారిని నోటిఫికేషన్కు అర్హులుగా ప్రకటించినుంది.  

2 /6

ఈ రిక్రూట్మెంట్ ను తెలంగాణ హైకోర్టు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టులో ఉన్న 52 రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక సమాచారం. కాబట్టి నిరుద్యోగ యువత అలర్ట్ గా ఉండాల్సిన సమయం వచ్చేసింది.  

3 /6

ఇక ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ జాబ్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ విద్యా అర్హతను కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయా జిల్లాల్లో ఉండే స్థానిక భాషపై కూడా అవగాహన ఉండాలని సూచించే ఛాన్స్ ఉంది.  

4 /6

అలాగే ఈ నోటిఫికేషన్ లో భాగంగా వయస్సు పరిమితిని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. కేవలం 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల వయసు గల వారే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే పరిమితిని కూడా తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ వయస్సు పరిమితులు భాగంగా వయో సడలింపులు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.  

5 /6

ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తు వివరాల్లోకి వెళితే.. తెలంగాణ హైకోర్టు ఈ నోటిఫికేషన్ను జనవరి 8వ తేదీ అందుబాటులోకి తీసుకురాబోతోంది.. దరఖాస్తు చేసుకునే వారు జనవరి 31వ తేదీ వరకు చేసుకోవలసి ఉంటుంది. దీనిని అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఓఏంఆర్ ఆధారిత పరీక్షను నిర్వహించబోతోంది.

6 /6

పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ, వివిధ టెస్టులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని పాస్ అయిన వారికి తెలంగాణ ప్రభుత్వం జాబ్ ఇచ్చి.. ప్రతినెల రూ.30 వేల జీతాన్ని అందిస్తుంది. త్వరలోనే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రాబోతున్నాయి.