Twins Born: అరటి పండు తింటే కవలలు పుడతారా? ఇందులో వాస్తవమెంత?

Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.

1 /7

కవలల జననం: కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. పుట్టిన కవలలు ఒకేలా కనిపిస్తే.. మరికొందరు భిన్నంగా కనిపిస్తారు.

2 /7

సాధారణ ప్రక్రియ: సాధారణంగా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇద్దరు (కవలలు) లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది.

3 /7

ఫలదీకరణం: ఆడవారు ఋతుస్రావం తర్వాత 10 నుంచి 18 రోజుల తర్వాత గుడ్డు ఉత్పత్తి చేస్తారు. దానిని అండం అంటారు. ఈ సమయంలో ఒక స్త్రీ, పురుషుడు శారీరక కలయిన ఏర్పడినప్పుడు పురుషుడి స్పెర్మ్‌లోని శుక్రకణం గుడ్డులోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియను ఫలదీకరణం అంటారు. అంటే స్త్రీ గర్భవతి అవుతుంది. 280 రోజుల తర్వాత స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ.

4 /7

ఒకేలా: కొన్నిసార్లు ఫలదీకరణ ప్రక్రియ తర్వాత గుడ్డు రెండు భాగాలుగా విడిపోతుంది. ఈ పరిస్థితిలో రెండు వేర్వేరు పిల్లలు గర్భంలో అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ విధంగా జన్మించిన పిల్లలను కవలలుగా పిలుస్తారు. ఒకే ఆకారం, రంగు, పరిమాణం కలిగి ఉంటారు. లింగం కూడా ఒకటే ఉంటుంది. పుడితే ఆడపిల్లలు లేదా ఇద్దరూ అబ్బాయిలు పుడతారు. ఒకే గుడ్డు నుంచి పుట్టడమే ఇందుకు కారణం.  

5 /7

భిన్నంగా: పురుషుడి వీర్యం నుంచి రెండు స్పెర్మ్ స్త్రీ విడిగా ఉన్న గుడ్లలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల కడుపులోనే ఇద్దరు పిల్లల ఎదుగుదల ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. ఇలా పుట్టిన కవల పిల్లలు భిన్నంగా ఉంటారు. ఈ ఇద్దరు పిల్లల లింగం ఒకేలా ఉండవచ్చు లేదంటే భిన్నంగా ఉండవచ్చు.

6 /7

30 ఏళ్ల తర్వాత: ఆలస్యంగా గర్భధారణ పొందితే కవలలు పుడతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలు 30 ఏళ్ల తర్వాత పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటే వారికి కవలలు పుట్టే అవకాశం ఉంది. ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు.

7 /7

అరటిపండు వాస్తవం: కవల అరటిపండు తింటే కవల పిల్లలు జన్మిస్తారనే నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే అరటిపండ్లు తినడానికి కవలలు పుట్టడానికి ఎలాంటి సంబంధం లేదని వైద్య శాస్త్రం చెబుతోంది. ఇది కేవలం పుకారు.. మూఢనమ్మకం అంటూ వైద్యులు కొట్టిపారేస్తున్నారు.