IPL 2020: ఐపీఎల్ లో తొలి 10 మ్యాచులపై ఆసక్తికరమైన విషయాలివే !

  • Sep 29, 2020, 16:49 PM IST

ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటి 10 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచులు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. యూఏఈ లో జరుగుతున్న ఈ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారో అనేది చివరి బంతి వరకు తెలియడం లేదు. కొన్ని మ్యాచులు సూపర్ ఓవర్ కు ముందు గానీ తేలడం లేదు. అలా ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచుల్లో ఆసక్తికరమైన అంశాలు ఇవే !

 

 

1 /5

గత 12 ఐపీఎల్ సీజన్లో కేవలం 9 మాత్రమే సూపర్ ఓవర్లు నమోదు అయ్యాయి. కానీ ఈ ఐపీఎల్ 2020 తొలి 10 మ్యాచుల్లోనే 2 సూపర్ ఓవర్లు నమోదు అయ్యాయి. ఢిల్లి వర్సెస్ పంజాబ్ టీమ్లు, ముంబై వర్సెస్ బెంగుళూరు టీమ్స్ సూపర్ ఓవర్స్ వరకు వచ్చాయి.

2 /5

అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన 12 సంవత్సరాల రికార్డు కూడా ఐపీఎల్ 2020లో బ్రేక్ అయింది. పంజాబ్ టీమ్ నిర్ధేశించిన 224 పరుగులను రాజస్థాన్ టీమ్ పూర్తి చేసి చూపించింది.

3 /5

ఐపీఎల్ మ్యాచుల్లో తొలి రెండు సెంచరీలు భారతీయ బ్యాట్స్ మెన్ చేయడం ఇది తొలి సారి. కేఎల్ రాహుల్ ( 132 ), మయాంక్ అగర్వాల్ ( 106 ) పరుగులు చేశారు. ఇద్దరూ పంజాబ్ టీమ్ ప్లేయర్సే.

4 /5

99 పరుగులు వద్ద ప్రతీ బ్యాట్స్ మెన్ కు కాస్త భయం ఉంటుంది. కొన్ని సార్లు ఆభయమే నిజం అవుతుంది. ఇలా 99 పరుగులపై ఐపీఎల్ లో ఔట్ అయిన 3వ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్.

5 /5

ఐపీఎల్ 2020 రాజస్థాన్ రాయల్స్ రికార్డు క్రియేట్ చేసింటి. చివరి ఐదు ఓవర్లలో 86 రన్స్ చేసింది. అంతకు ముందు 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 5 ఓవర్లు 77 పరుగులు చేసింది.