Keerthy Suresh Wedding: సమంత రూత్ ప్రభు ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కీర్తిసురేష్ పెళ్లిపై గురించి పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఒక వైపు తన సినిమాలు, వెబ్ సిరిస్ ల గురించి అప్ డేట్ లు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టులు కూడా పెడుతుంటారు.
ముఖ్యంగా చైతుపెళ్లి సెట్ అయ్యాక.. సామ్..అన్ని సెటైరీకల్ పోస్టులు తన మాజీ భర్తను ఉద్దేశించి పెడుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఎక్స్ పైన పెట్టిన డబ్బులన్ని వెస్ట్ అయ్యాయని, శునకం ప్రేమ ముందు ఏ ప్రేమ అయిన వెస్ట్ అంటూ సామ్ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
అయితే.. సమంత తాజాగా.. నటి కీర్తీసురేష్ పెళ్లి గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈరోజు గోవాలో కీర్తిసురేష్ , తన చిన్ననాటి మిత్రుడు.. ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
గోవాలో వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. కీర్తీసురేష్ రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరుగుందని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో సమంతా.. కొత్త జంటకు బెస్ట్ విషేస్ చెబుతు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.
కీర్తిసురేష్, ఆంటోనీ జంటకు స్పెషల్ గా విషెస్ చెబుతూ.. ఎల్లప్పుడు.. ఆనందంగా ఉండాలి.. జీవితాంతం ఫుష్ ఖుషీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెబుతూ.. మూడు హర్ట్ సింబర్ ఎమోజీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సామ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు. మరోవైపు సమంత ఇటీవల కొత్త ఏడాదిలో పెళ్లి, పిల్లల గురించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సామ్ అభిమానులు కూడా తొందరలోనే సమంతను పెళ్లి కూతురులా చూడాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారంట.