pragya nagra leaked video controversy: మలయాళ నటి ప్రజ్ఞా నాగ్రాకు చెందిన ప్రైవేటు వీడియోలు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెనుదుమారం చెలరేగింది. దీనిపై తాజాగా, నటి ప్రజ్ఞా నాగ్రా రియాక్ట్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
సోషల్ మీడియాలో కొంత మంది ఇటీవల టెక్నాలజీని తప్పుడు మార్గంలో వాడుకుని దారుణాలు పాల్పడుతున్నారు. హీరోయిన్ల ఇమేజ్ లను మార్ఫింగ్ లకు పాల్పడుతున్నారు. అశ్లీల సైట్ లలో పెడుతున్నారు.
కొన్ని నెలల క్రితం డీప్ ఫెక్ టెక్నాలజీతో హీరోయిన్లు ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసిన ఘటన దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరల ఒక హీరోయిన్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ లకు పాల్పడినట్లు తెలుస్తొంది.
మళయాళ భామ..ప్రజ్ఞా నాగ్రా కుచెందిన ప్రైవేటు వీడియో అంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై దుమారం చెలరేగింది. ఈ క్రమంలో దీనిపై నటి ప్రజ్ఞా నాగ్రా స్పందించారు. టెక్నలజీని ఇలాంటి తప్పుడు పనుల కోసం వాడుకొవడం దారుణమన్నారు.
ఒకరి వ్యక్తిత్వంను హననం చేసే విధంగా పనులు చేయడం సరికాదని, మీరు మనుషులేనా.. అంటూ ఫైర్ అయినట్లు తెలుస్తొంది. ఇలాంటి కష్టపరిస్థితుల్లో.. తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని పోలీసు శాఖను, సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ప్రజ్ఞా నాగ్రా ట్యాగ్ చేసినట్లు తెలుస్తొంది.
తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరక్కుడదని కోరుకుంటున్నట్లు నటి ప్రజ్ఞా నాగ్రా ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా.. హర్యానాకు చెందిన ప్రజ్ఞా నాగ్రా.. మోడల్ గా కెరిర్ స్టార్ట్ చేశారు..
2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియంతో తెరంగేంట్రం చేశారు.ఆ తర్వాత ఎన్ 4, నథికళిల్ సందరి యమున మూవీస్ లో నటించారు. తెలుగులో లగ్గం మూవీలో నటించిన విషయం తెలిసిందే.