Sreeleela: శ్రీలీలకు మెగా హీరో దీపావళి బంపర్ గిఫ్ట్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..!

Sreeleela: టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల త్వరలో  మెగాహీరోతో పీక లోతు ప్రేమలో ఉందా. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంతేకాదు ఆ మెగా కథానాయకుడు దీపావళి సందర్భంగా శ్రీలీలకు అదిరిపోయే బంపర్ గిఫ్ట్ పంపించడానే వార్తలు కోడై కూస్తున్నాయి.

1 /7

Sreeleela:  తెలుగులో బుల్లెట్‌లా వచ్చి రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంది శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన టాలెంట్ చూపెడుతుంది. ఈమె తెలుగులో వరుస సినిమాలతో దుమ్ము దులుపుతోంది. ప్రస్తుతం ఈ భామ పీక లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

2 /7

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఈమె గత కొన్ని రోజులుగా ప్రేమలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి లాస్ట్ ఇయర్ ‘ఆదికేశవ’ సినిమా  చేశారు. ఆ మూవీ టైమ్ నుంచే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అంతేకాదు వీళ్లిద్దరు పలు సందర్బాల్లో ప్రైవేటు పార్టీల్లో కలుసుకుంటున్నారట.

3 /7

ఇక వీరిద్దిరి పెళ్లి ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. తాజాగా వైష్ణవ్ తేజ్.. శ్రీలీలకు ఓ బంపరాఫర్ గిఫ్ట్ పంపించాడట.  

4 /7

దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే ఓ వజ్రాల నెక్లెస్ గిఫ్ట్ గా పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా.. ? లేకపోతే ఓ స్నేహితుడిగా ఆమెకు పంపించాడా..? అనేది  తెలియాల్సి ఉంది. శ్రీలీల విషయానికొస్తే..  ఈమె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్లిసందD’ మూవీతో పరిచయమైంది.

5 /7

శ్రీలీల ఈ యేడాది ‘గుంటూరు కారం’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.  త్వరలో  పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పాటు.. రవితేజతో చేస్తోన్న మూవీపై శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే ఈమె కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగినట్టే.

6 /7

శ్రీలీల పర్సనల్ విషయానికొస్తే..  2001లో జూలై 14న అమెరికాలో జన్మించింది. వీళ్లది తెలుగు ఫ్యామిలీ కావడం విశేషం. ఈమె తల్లి ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన శ్రీలీల బెంగళూరులో చదువుకుంది. పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

7 /7

ఏది ఏమైనా శ్రీలీల తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ అయిన మెగాఫ్యామిలీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ వంటి వారు సినిమా హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్.. శ్రీలీలను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x