Nagarjuna Top Movies: నాగార్జునను టాలీవుడ్ కింగ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..

Nagarjuna Top Movies: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకాదు యాక్టర్ గా ఒక మూసకు పరిమితం కాకుండా.. క్లాస్ అండ్ మాస్  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో టాప్ చిత్రాలున్నాయి. అందులో  నాగార్జునను యువసామ్రాట్ నుంచి కింగ్ ను చేసిన కొన్ని టాప్ మూవీస్ విషయానికొస్తే..

1 /11

సోగ్గాడే చిన్ని నాయనా.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. హీరోగా నాగార్జున పనైపోయిందన్న టైమ్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది.

2 /11

మనం.. అక్కినేని ఫ్యామిలికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం ‘మనం’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్యలతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఈ సినిమా అక్కినేని అభిమానులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

3 /11

కింగ్.. శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున హీరోగా  తెరకెక్కిన మూవీ ‘కింగ్’. ఈ సినిమా నుంచి నాగార్జున బిరుదు.. యువసామ్రాట్ నుంచి కింగ్ గా మారింది.  

4 /11

మన్మథుడు.. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ మాటలు అందించిన సినిమా ‘మన్మథుడు’. ఈ సినిమా నాగ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమాతో నాగార్జునను టాలీవుడ్ మన్మథుడిగా పిలవడం మొదలుపెట్టారు.

5 /11

శ్రీరామదాసు.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శ్రీరామదాసు’. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా నాగ్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

6 /11

అన్నమయ్య.. నాగార్జున హీరోగా సుమన్, మోహన్ బాబు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘అన్నమయ్య’. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే తెలుగు సినిమాల్లో అద్భుత భక్తిరస చిత్రంగా నిలిచిపోయింది.  

7 /11

నిన్నే పెళ్లాడతా.. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు హీరో, హీరోయిన్లుగ నటించిన చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ఈ సినిమా అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రంగా నిలిచిపోయింది.

8 /11

హలో బ్రదర్.. నాగార్జున పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘హలో బ్రదర్’. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

9 /11

గీతాంజలి.. మణిరత్నం తెలుగులో డైరెక్ట్ చేసిన ఏకైక చిత్రం  ‘గీతాంజలి’. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

10 /11

శివ.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివ’. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచిపోయింది.

11 /11

నాగార్జున హిట్స్.. వీటితో పాటు నాగార్జున హీరోగా నటించిన విక్రమ్, మజ్ను, ఆఖరి పోరాటం, జానకి రాముడు, అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం,వారసుడు, రక్షణ, నువ్వు వస్తావని, సంతోషం, నేనున్నాను, మాస్ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు నాగార్జున ఖాతాలో ఉన్నాయి.