Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
వకీల్ సాబ్.. 2019 ఎన్నికల తర్వాత కాస్త గ్యాప్ తో పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘వకీల్ సాబ్’. కరోనా సెకండ్ వేవ్ లో విడుదలై సంచలన మంచి విజయాన్నే సాధించింది. ఒకవేళ కోవిడ్ సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది.
అత్తారింటికీ దారేది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ ‘అత్తారింటికీ దారేది’. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి హీరోగా పవన్ స్టామినా ఏంటో చూపించింది.
గబ్బర్ సింగ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. హిందీలో హిట్టైన ‘దబాంగ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది.
ఖుషీ.. ఎస్.జే.సూర్య హీరోగా పవన్ కళ్యాణ్, భూమిక హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అంతేకాదు ప్రేమకథా చిత్రాల్లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
బద్రి.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బద్రి’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
తమ్ముడు.. పీ.ఏ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘తమ్ముడు’. హిందీలో ఆమీర్ ఖాన్ హీరోగా హిట్టైన ‘జో జీతా వహీ సికిందర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. హిందీలో సైకిల్ పోటీలో నేపథ్యంలో తెరకెక్కితే..తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కి సంచలన విజయం సాధించింది.
తొలిప్రేమ.. ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ సినిమా తెలుగు సినిమా ప్రేమ కథా చిత్రాల్లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
సుస్వాగతం.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుస్వాగతం’. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.