Police Lathi Charge On Group 1 Aspirants At Ashok Nagar: తెలంగాణ పోలీసులు అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు బట్టలు చింపి.. ఈడ్చుకెళ్తూ దారుణంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఫొటోలు చూస్తే కన్నీళ్లే వస్తాయి.
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ముందుకెళ్తున్నారు.
పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది.
కోచింగ్‌కు అడ్డాగా ఉన్న అశోక్‌నగర్‌లో రోజురోజుకు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
పరీక్ష వాయిదా కోసం మూడో రోజు శుక్రవారం ఆందోళన చేపట్టగా పోలీసులు దారుణంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులు ఒక్క విద్యార్థి కనిపించినా వెంటనే అత్యంత అమానుషంగా తీసుకెళ్లి అరెస్ట్‌లు చేస్తున్నారు.
ఈ క్రమంలో విద్యార్థులను ఈడ్చుకుంటూ.. తొక్కుతూ.. పిడిగుద్దులు కొడుతూ తీసుకెళ్తుండడంతో పోలీసుల వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పోలీసుల దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలవుతున్నాయి. బట్టలు చినిగిపోవడంతో విద్యార్థులు అవమానంగా భావిస్తున్నారు.
తమకు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఫేస్ మాస్క్‌లు పెట్టుకొని గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టడం గమనార్హం.
ఉన్నత చదువులు చదివి తమకు ఉద్యోగాలు అడిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దాడులు చేయడంపై విద్యార్థి లోకంతోపాటు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.