Tgpsc releases 86 diet lectured posts: టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డైట్ విభాగంలో 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Telangana Govt: తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల అయింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 24 అత్యున్నత గెజిటెడ్ కేడర్ పోస్టులను జనరల్ రిక్రూట్మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.
TGPSC announces three govt job notifications: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేళ టీజీపీఎస్సీ మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగులు మాత్రం టీజీపీఎస్సీ చెప్పిన మాటలు నిలబెట్టుకొవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tgpsc Govt job notification: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ టీజీపీఎస్సీ భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేశారు. ఉద్యోగాల భర్త జెట్ స్పీడ్ లో, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాజాగా.. 3,800 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 3,093 పోస్టులు, మిగతా డిపార్ట్మెంట్లలో సింగిల్ పోస్ట్ ఖాళీలు ఒక 25 వరకు ఉన్నాయి. ఇక మీదట ప్రతి నెల సగటున 3 నోటిఫికేషన్లు ఇస్తామని టీజీపీపీఎస్సీ చైర్మన్ వెల్లడించారు. కష్టపడి చదివిన వారికే జాబ్ వస్తుందని, ఎక్కడ ఎలాంటి అసత్యపు ప్రచారాలు నమ్మోద్దన్నారు.
TGPSC Assistant Scientist Recruitment 2026: డిగ్రీ పూర్తి చేసిన ఇంట్లోనే ఉంటున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. భారీ వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఓటీఆర్ (OTR- One Time Registration) అప్డేట్ గడువును మరోసారి పోస్ట్‌పోన్ చేసింది. అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా మార్చి 25 వరకు ఇచ్చిన గడువును.. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించబడింది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు.
Telangana high court cancels 2015-16 Group-2: పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. పరీక్ష నిర్వహించడంలోహైకోర్టు ఆదేశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉల్లంఘించిందని సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది.
Telangana Group-2: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల రిజల్ట్ ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 2022 నోటిఫికేషన్‌కు సంబంధించిన 783 గ్రూప్-2 పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నేడు ప్రకటించింది. ఇందులో ఒక పోస్టు భర్తీ కాలేదు. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన రాత పరీక్షలకు సుమారు 2.5 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసిన కమిషన్, ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు పూర్తి చేసింది.
Group-1: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన తీర్పును కొట్టివేస్తూ.. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయని పేర్కొంటూ.. కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
High Court Big Shock to TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అన్ని అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో టీజీపీఎస్సీ ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
Presidential Order on local candidature: స్థానికత అంశంపై మొత్తనికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకొవచ్చు. తాజాగా.. రాష్ట్రపతి ఉత్తర్వులలో అభ్యర్థులకు ఉన్న సందేశాలకు పరిష్కారం దొరికినట్లైంది. ఈ క్రమంలో ఉద్యోగ అభ్యర్థులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Big Twist In TSPSC Group 1 Posts: తెలంగాణ నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూపు 1 ఉద్యోగాల భర్తీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తీవ్ర ఆరోపణలు.. వివాదం నెలకొన్న గ్రూపు 1 ఉద్యోగాలపై బండి సంజయ్ రంగంలోకి దిగారు. కమిషన్‌కు లేఖ రాసి సమగ్ర వివరాలు తనకు సమర్పించాలని డిమాండ్ చేశారు.
Group 1 Mains Aspirants Filed Petition In Telangana High Court: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అభ్యర్థులు తమకు అన్యాయం జరుగుతోందని.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏం జరిగిందో తెలుసుకుందాం.
TGPSC Group 3 Results Released Checkout: టీఎస్పీఎస్సీ వరుసగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుండగా ఈ క్రమంలోనే గ్రూపు 3 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఆ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
TGPSC Group 1 Mains Results Release: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ప్రాథమికంగా పరీక్షకు సంబంధించిన మార్కులను కమిషన్ విడుదల చేసింది.
Tgpsc new chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త బాస్ గా సీనియర్ ఐఎఎస్ బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Tgpsc group 2 hall tickets: గ్రూప్ ఎగ్జామ్ లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ బిగ్ అప్ డేట్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. డిసెంబరు 9 నుంచి హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొవాలని సూచించింది.
TGPSC | Group 1 Aspirant On Arrangements
KT Rama Rao Supreme Court: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో తాము హైకోర్టులో పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులు ఉండే అశోక్‌నగర్‌కు దమ్ముంటే రేవంత్, రాహుల్ గాంధీ వెళ్లాలని సవాల్ విసిరారు.
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
Police Lathi Charge On Group 1 Aspirants At Ashok Nagar: తెలంగాణ పోలీసులు అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు బట్టలు చింపి.. ఈడ్చుకెళ్తూ దారుణంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఫొటోలు చూస్తే కన్నీళ్లే వస్తాయి.