Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..


Ramoji Rao introduced heroes List: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.

1 /9

కేవలం ఈ హీరోలు మాత్రమే కాదు.. ఎంతో మంది నటీనటులను దర్శకులను, కీరవాణి వంటి సాంకేతిక నిఫుణులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా రామోజీ రావుకు దక్కుతోంది. ఈ లెజెండ్ మరణం తెలుగు సినీ, రాజకీయ, పాత్రికేయ రంగాలకు తీరని లోటు అని చెప్పాలి.

2 /9

నందమూరి తారక రామారావు (జూ ఎన్టీఆర్) బాలనటుడిగా తాత ఎన్టీఆర్, బాబాయి బాలయ్యలతో ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ హిందీ వెర్షన్ తో పాటు రామాయణం సినిమాల్లో బాల నటుడిగా నటించిన జూనియర్.. రామోజీ రావు నిర్మించిన ‘నిన్ను చూడాలని’ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.

3 /9

కళ్యాణ్ రామ్ నందమూరి బాలగోపాలుడు సినిమాలో బాల నటుడిగా నటించిన కళ్యాణ్ రామ్.. ‘తొలిచూపులోనే‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది రామోజీకి చెందిన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కావడం విశేషం.

4 /9

తనీష్ బాలనటుడిగా పలు సినిమాల్లో అలరించిన తనీష్ ను హీరోగా పరిచయం అయింది రవిబాబు దర్శకత్వంలో రామోజీ రావు నిర్మాణంలో తెరకెక్కిన ‘నచ్చావులే’ మూవీతో కావడం విశేషం.

5 /9

తరుణ్ రామోజీ రావుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ‘నువ్వే కావాలి’ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు తరుణ్. ఒక తరం ప్రేక్షకులను అలరించాడు.

6 /9

ఉదయ్ కిరణ్ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయమై ఓ వెలుగు వెలిగాడు.ఇదే సినిమా రీమా సేన్ కథానాయికగా పరిచయమైంది.

7 /9

రాజేంద్ర ప్రసాద్ అప్పటి వరకు కమెడియన్ గా అలరించిన రాజేంద్ర ప్రసాద్ ను వంశీ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై హీరోగా పరిచయం చేసింది రామోజీరావే.

8 /9

శ్రీకాంత్ పీపుల్స్ ఎన్ కౌంటర్ మూవీతో శ్రీకాంత్ వెండితెరకు పరిచయం చేసారు రామోజీ రావు.

9 /9

వినోద్ కుమార్ మౌన పోరాటం మూవీతో వినోద్ కుమార్ ను తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసిన ఘనత రామోజీ రావుకు దక్కుతుంది.