Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. రేపు వాళ్లకు దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?

Tirupati news: తిరుమకు ప్రతీరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ శ్రీవారి భక్తులు బిగ్ అలర్ట్ ను జారీ చేసినట్లు తెలుస్తొంది.

1 /6

తిరుమల శ్రీవారిని ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. స్వామి వారి దర్శనం జరిగితే చాలని పరితపిస్తుంటారు. ఇటీవల కూటమి సర్కారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రయారిటీగా తిరుమల దర్శనం అయ్యేలా చూడాలని టీటీడీకి ఆదేశించింది. అదే విధంగా ఇటీవల నూతన టీటీడీ బోర్డును సైతం నియమించారు.   

2 /6

టీటీడీ చైర్మన్ నాయుడు ప్రజలకు, సామాన్య భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుం జనవరి 10న వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు.  

3 /6

 ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యాలు కల్గకుండా.. భోజనం, వసతి ఏర్పాట్లను దగ్గకుండా చూస్తున్నారు. తిరుమలలో భక్తులను దోపీడీ చేసే ముఠాలు, అన్యమత ప్రచారం చేసే వాళ్లపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తొంది.  

4 /6

పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు, రీల్స్, వీడియోలు తీసే వారిపై కూడా టీటీడీ ఇటీవల సీరియస్ అయినట్లు తెలుస్తొంది. అయితే.. ప్రస్తుతం టీటీడీ తిరుమలకు వీఐపీ సిఫారసుల మీద వచ్చే భక్తులకు కీలక అలర్ట్ ను జారీచేసింది.  

5 /6

రేపు అంటే.. జనవరి 7 తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమలలో రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవ ఉంటాయి. ఈ క్రమంలోనే.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు టీటీడీ వెల్లడించింది.  

6 /6

అయితే.. సాధారణ దర్శనాలు మాత్రం యథాతథంగా ఉంటాయని కూడా  టీటీడీ తెలిపింది. మరోవైపు.. రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో స్థానిక దర్శనాలు (లోకల్ భక్తులకు) ఉంటాయి. ప్రతీ మంగళవారం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో స్థానిక దర్శనాలు ఉంటాయి.