Walking Fish Pics Viral: ఎప్పుడైనా మీరు నడి చేపను చూశారా? ఈ ప్రాంతంలో చేపలు నడుస్తాయి. అంతేకాకుండా చెట్టు కూడా ఎక్కుతాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Walking Fish Pics Goes To Viral: మనం చేపలను కేవలం నీటిలో మాత్రమే చూసి ఉంటాం.. ఈ విషయం అందరికీ తెలుసు.. ఎందుకంటే చిన్న పిల్లల నుంచే ఈ విషయం అందరికీ తెలుసు.. చేపలు నీటిలో ఉంటాయని పలు కథల్లో విని ఉంటారు. అప్పుడప్పుడు సముద్రం నుంచి బయటి కొట్టుకొచ్చిన చేపలను కూడా చూసి ఉంటారు. అయితే ఇలా వచ్చిన అన్ని చేపలు కొద్ది సేపటికీ చనిపోతూ ఉంటాయి.
కానీ ఈ రోజు మీరు చూడబోయే చేపలు నీటిలో నుంచి బయటకు వచ్చిన జీవిస్తాయి. ఈ విషయం తెలియగానే అందరికీ ఆశ్చర్యం కలుగొచ్చు. ఇది పక్కా నిజం.. ఇండో-పసిఫిక్‌లో ఉండే ఓ ప్రాంతంలో భూమిపై జీవించే చేపలకు చాలా ప్రసిద్ధి.. ఇక్కడ కొన్ని జాతులకు సంబంధించిన చేపలు నీటిలోనే కాకుండా బయట కూడా జీవిస్తాయి..
ఇండో-పసిఫిక్‌లో ఉన్న కొన్ని సముద్ర తీరాల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి చేపలు ఉన్నాయని సమాచారం. అయితే ఇక్కడ ఉండే సముద్రపు నీరు ఎల్లప్పుడే ఒకే స్థాయిలో ఉండడం వల్ల అందులో నివసించే చేపలు బయట కూడా నివసిస్తాయట.
ఈ సముద్ర తీరాల్లో కేవలం రెండు నుంచి మూడు జాతులకు సంబంధించిన చేపలే ఉంటాయి. ఎక్కువ జాతులు ఉండవట.. అయితే ఇక్కడ నివసించే చేపల్లో కొన్ని భూమిపై కూడా నడిస్తాయని సమాచారం.. అలాగే కొన్ని ఒక చోటి నుంచి మరో చోటికి జంపింగ్ చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంటాయట..
ఇక్కడ జీవించే చేపలు సముద్రంలో నీరు గడ్డ కట్టినప్పుడు, నీరు లేని పరిస్థితుల్లో బయటకి వచ్చి జీవిస్తాయి. అలాగే ఇవి చిన్న చిన్న చెట్లు కూడా ఎక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి మడ అడవులు ఉన్న చోట్ల ఎక్కువగా జీవిస్తాయని కొంతమంది మత్స్య కారులు తెలిపారు.
భూమిపై జీవించే చేపలను అక్కడి దేశాల ప్రజలు 'మోప్పడాయ చేపలు'గా పిలుస్తారు. అంతేకాకుండా ఈ చేపలు ప్రత్యేకంగా భూమిపై జీవించడానికి చేపలు చర్మం, నోటి లోపలి నుంచి గాలిని పీల్చుకుంటారు. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన చిన్న చేతులు కూడా ఉంటాయని సమాచారం.
ఈ చేపలు నీటిలో కాకుండా బయట చాలా సేపు జీవించగలిగే ప్రత్యేకమైన సామర్థ్యం కలిగి ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా వీటికి ముందు ఎంతో దృఢమైన రెక్కలు కూడా ఉంటాయి. వీటితోనే స్పీడ్‌గా జంప్ కూడా చేస్తాయి.