EPFO : మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందా ? లేదా? ఎలా చెక్ చేసుకోవాలంటే?

EPFO Employees Contribution: మీరు ప్రతినెల వేతనం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగి అయితే..మీ కంపెనీలో 20 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లయితే మీకు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ప్రతినెలా మీవేతనంలో నుంచి 12శాతం కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బు చేయాలి. కంపెనీ అంటే యజమాని కూడా అంతే మొత్తం డబ్బు యాడ్ చేయాలి. మరి ఈ డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి? 
 

1 /8

EPFO Employees Contribution: సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. కనీసం 20మందికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థ ఈపీఎఫ్ఓలో చేరాలి. మీరు ఈపీఎఫ్ఓ చందాదారులు అయితే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతినెలా కూడా వేతనం బేసిక్ పే నుంచి 12శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. ఇది మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది.

2 /8

యజమాని కూడా 12శాతం జమ చేయాలి. ఇందులో 3శాతానికిపైగా పీఎఫ్ అకౌంట్లోకి 8 శాతానికిపైగా ఈపీఎస్ కు వెళ్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ మీ కంపెనీ ప్రతినెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందో లేదో తెలుసుకోవాలి.   

3 /8

కొన్నిసార్లు పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ కు సంబంధించి చందాదారులకు మెసేజ్ లు వస్తాయి. కొన్నిసమయాల్లో రావు. ఇలా కొందరికి అసలే మెసేజ్ లు రావు. అయినా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతినెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ అవుతున్నాయో లేదా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ఛాన్స్ ఉంది.

4 /8

ఆ మధ్య బైజూస్ వంటి చాలా కంపెనీలు ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల పీఎఫ్ డబ్బును జమ చేయలేదు. ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసినా..అకౌంట్లో జమ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలా నిధుల కొరత వల్ల చాలా కంపెనీలు ఇలాంటి పనులు చేస్తుంటాయి.   

5 /8

పీఎఫ్ డబ్బులు జమ కావాలంటే యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ లో ఉండాలి. కచ్చితంగా ప్రతినెలా డబ్బులు పడుతున్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. పీఎఫ్ బ్యాలెన్స్ కోసం పీఎఫ్ మెంబర్స్ పోర్టల్ లాగిన్ కావడం వల్ల పాస్ బుక్ లో చెక్ చేసుకోవచ్చు.

6 /8

 ఉమంగ్ యాప్ 9966044425 నెంబర్ కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇంకా ఎస్ఎంఎస్ సదుపాయం కూడా ఉంది. అప్పుడు మీరు స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాల్సిన బాధ్యత కూడా కంపెనీ మీద ఉంటుంది. ఆన్ లైన్ ద్వారానే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.   

7 /8

మీరు పనిచేస్తున్న కంపెనీ దివాళ తీసినా లేదా కార్యకలాపాలు మూసేయాల్సి వచ్చినా..మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సి ఉటుంది. ఇతర అన్ని అప్పులను తీర్చేయకముందే ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

8 /8

మీ పీఎఫ్ అకౌంట్లో యజమాని ప్రతినెలా పీఎఫ్ డబ్బులు వేయపోయతే ఇది మీరు గమనిస్తే ఫిర్యాదు చేయాలి. దీనికోసం ఈపీఎఫ్ గ్రీవియెన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.