బోంబే రండి.. అంతు తేలుస్తా..!

                        

Last Updated : Oct 2, 2017, 06:30 PM IST
బోంబే రండి.. అంతు తేలుస్తా..!

రాయ్‌పూర్ :  ఈ మధ్యకాలంలో విమానాల్లో సెలబ్రిటీల దురుసుతనం రోజు రోజుకీ పెరిగిపోతోంది.  తమ హోదాని, గౌరవాన్ని మరించి  ప్రవర్తించే అలాంటి వారి జాబితాలో బాలీవుడ్ గాయకుడు మరియు ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ కూడా చేరాడు. సోమవారం ఆయన రాయ్‌పూర్ విమానాశ్రయంలో విమాన సిబ్బందిపై దురుసుగా, దూకుడుగా ప్రవర్తించిన తీరు మీడియాకి చిక్కింది.  పరిమితి కన్నా ఎక్కువ సామానులను క్యాబిన్ వద్దకు తీసుకురావడంతో సిబ్బంది ఆయనను వారించగా... ఆయన కోపాద్రిక్తుడై , గట్టిగా అరుస్తూ ఇండిగో విమాన సిబ్బందిని బెదిరించారు. కొందరు విమానాశ్రయ సిబ్బంది ఆయనకు నియమ నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకు ప్రయత్నించగా, ఆదిత్య నారాయణ్ తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ.. వారిని దూషించారు.  ముంబైలో నీ సంగతి చూస్తానంటూ అరిచారు. ‘‘నీ చెడ్డీ ఊడదియ్యకపోతే, నా పేరు ఆదిత్య నారాయణ్ కాదు’’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన బూతులు తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Trending News