Driverless Bike Video: డ్రైవర్​లెస్​ కారు చూశారు.. మరి డ్రైవర్​లెస్​ బైక్​ చూశారా?

Driverless Bike Video: డ్రైవర్​లెస్​ కారును వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ ఇటీవలే ఓ కారును ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే అంతలోనే డ్రైవర్​లెస్​ బైక్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్​ అవుతుంది. డ్రైవర్​ లేకుండా బైక్​ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారా? అయితే అదేంటో మీరూ చూసేయండి! 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 07:24 PM IST
    • సోషల్​ మీడియాలో డ్రైవర్​లెస్​ బైక్​ వీడియో వైరల్​
    • ఆ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసిన ఆనంద్​ మహీంద్రా
    • ఫన్నీ కామెంట్స్​ చేస్తున్న నెటిజన్లు
Driverless Bike Video: డ్రైవర్​లెస్​ కారు చూశారు.. మరి డ్రైవర్​లెస్​ బైక్​ చూశారా?

Driverless Bike Video: సోషల్​ మీడియాలో ఎప్పడూ యాక్టివ్​ ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా(Anand Mahindra News).. తరచుగా నెటిజన్లతో పలు విశేషాలను షేర్​ చేస్తుంటారు. తాజాగా డ్రైవర్​లెస్​ మోటార్​సైకిల్​(Driverless Bike) అంటూ ఓ వీడియోను ట్విట్టర్​లో(Anand Mahindra Twitter) షేర్​ చేశారు ఆనంద్​ మహీంద్రా. అందులో పల్సర్​ బైక్​పై ఓ వ్యక్తి వెనుక సీట్​లో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఆ బైక్​కు డ్రైవర్​ అంటూ ఎవరూ లేరు. ఆ బైక్​ దానంతట అదే ముందుకు సాగుతూ ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సహా ఆనంద్​ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో ప్రస్తుతం వైరల్​గా మారింది. 

ఈ వీడియోను ట్విటర్‌లో షేర్​ చేసిన ఆనంద్​ మహీంద్రా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్​ దిగ్గజ నటుడు కిషోర్​ కుమార్​ హీరోగా 1972లో విడుదలైన 'పరిచై' సినిమాలోని ఓ పాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 'డ్రైవర్​ లేకుండా సాగే ప్రయాణం నాది.. దానికి గమ్యం అంటూ లేదు' అంటూ ఆనంద్​ మహీంద్రా ట్వీట్​(Anand Mahindra Twitter) చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 5.95 లక్షల మంది వీక్షించారు. 

ఈ డ్రైవర్​లెస్​ బైక్​ వీడియో (Driverless Bike Video) చూసిన కొందరు నెటిజన్లు.. "డ్రైవర్​లెస్​ కారును రూపొందించిన టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​(Elon Musk News) కూడా ఈ బైక్​ను చూస్తే షాక్​ అవ్వాల్సిందే" అని కామెంట్లు చేస్తున్నారు. ఇండియాలో డ్రైవర్​లెస్​ బైక్​ వచ్చిందని కామెంట్​ చేస్తుండగా.. మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్​ చేయడం బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News