Viral Video: స్నేహితుల మధ్య బైక్ స్టంట్ వేశాడు.. మూల్యం చెల్లించుకున్నాడు! వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా

 Viral Video Today: ఓ యువకుడు జీరో కట్ స్టంట్ చేసి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Written by - P Sampath Kumar | Last Updated : Aug 23, 2022, 11:56 AM IST
  • స్నేహితుల మధ్య బైక్ స్టంట్ వేశాడు
  • మూల్యం చెల్లించుకున్నాడు
  • వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా
Viral Video: స్నేహితుల మధ్య బైక్ స్టంట్ వేశాడు.. మూల్యం చెల్లించుకున్నాడు! వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా

 Viral Video Today: ప్రస్తతం యువత వాహనాలనతో స్టంట్స్ వేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా స్టంట్స్ చేస్తున్నారు. కొందరు ఒక వీల్ గాల్లో లేపి స్టంట్ చేయగా.. కొందరు జీరో కట్ స్టంట్ చేస్తారు. అయితే చాలా శిక్షణ ఉంటేనే ఈ స్టంట్స్ వర్కౌట్ అవుతాయి. కొంచెం మిస్ అయినా ఈ స్టంట్స్  ఫెయిల్ అయి మూల్యం చెలించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ యువకుడు జీరో కట్ స్టంట్ చేసి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కొందరు యువకులు మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న మట్టి రోడ్డుపై బైక్ స్టంట్స్ చేస్తున్నారు. ఓ యువకుడు స్టంట్ వేస్తుండగా.. చుట్టూ దాదాపుగా 10 మంది ఉన్నారు. యువకుడు ఓసారి విజయవంతంగా జీరో కట్ స్టంట్ పూర్తిచేస్తాడు. రెండోసారి కూడా సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేరాడు. అయితే రెండోసారి స్టంట్ వేసిన అనంతరం బైక్ అదుపు తప్పుతుంది. యువకుడు సరిగ్గా రోడ్డు సైడ్ వచ్చేసరికే.. బైక్ అదుపు తప్పుతుంది. దాంతో రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్‌ను బైక్ ఢీ కొడుతుంది. 

ట్రక్‌ను ఢీ కొట్టగానే బైక్ అల్లంత దూరం ఎగిరిపడింది. మరోవైపు యువకుడు కూడా రోడ్డుపై పడతాడు. అక్కడే ఉన్న వారందరూ యువకుడి దగ్గరకు పరుగులు పెడతారు. లేపండి, లేపండి అంటూ వెనకాల ఉన్న కొందరు అరుస్తూ పరుగెడతారు. వీడియో చూస్తుంటే.. యువకుడికి భారీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో 'రాచకొండ పోలీసులు' అనే ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేశారు. బైక్ స్టంట్స్ చేయడం చాలా ప్రమాదకరమని, ప్రాణ నష్టంతో సహా తీవ్ర గాయాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. 

Also Read: Megastar Chiranjeevi rare photos: మీరెప్పుడూ చూడని మెగాస్టార్ ఫోటోలు

Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్? సీబీఐ ఉచ్చులో కేసీఆర్ ప్యామిలీ..  నెక్స్ట్ టార్గెట్ సారేనా.. ?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News