Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్? సీబీఐ ఉచ్చులో కేసీఆర్ ప్యామిలీ.. నెక్స్ట్ టార్గెట్ సారేనా.. ?

Delhi Liquor Scam: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. తాజాగా సీబీఐ కేసులో అడ్డుంగా బుక్కైంది కేసీఆర్ ఫ్యామిలీ.

Written by - Srisailam | Last Updated : Aug 22, 2022, 09:22 AM IST
  • సీబీఐ ఉచ్చులో కేసీఆర్ కుటుంబం
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత
  • కవితను అరెస్ట్ చేస్తారా?
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్? సీబీఐ ఉచ్చులో కేసీఆర్ ప్యామిలీ..  నెక్స్ట్ టార్గెట్ సారేనా.. ?

Delhi Liquor Scam: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. తాజాగా సీబీఐ కేసులో అడ్డుంగా బుక్కైంది కేసీఆర్ ఫ్యామిలీ. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారంలో కాదు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా సంచలనమైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కీలక రోల్ పోషించారని ఆరోపిస్తున్న ఢిల్లీ బీజేపీ ఎంపీ.. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

వందల కోట్ల రూపాయలు స్వాహా చేసేందుకే తీసుకొచ్చారని ఆరోపణలు ఉన్న ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ ఫ్యామిలీ సన్నిహితులే రూపొందించారని బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో  ఢిల్లీలోకి ఒబెరాయ్ హోటల్ లో మకాం వేసి ఆ తతంగం మొత్తం జరిపించారని ఆరోపించారు. తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన ఒక వ్యక్తి ఆ  విమానాన్ని అరేంజ్ చేశారని చెప్పారు. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీ తయారైందంటున్నారు బీజేపీ ఎంపీ. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి మొదటి ఇన్ స్టాల్ మెంట్ కింద ఇచ్చిన 150 కోట్ల రూపాయలను తెలంగాణ నుంచి వచ్చిన వారే ఇచ్చారన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి డీల్స్ చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తగ దగ్గర ఉన్నాయని చెప్పారు ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ. కేసీఆర్ కుటుంబ సభ్యులతో  ఒబేరాయ్ హోటల్ లో మీటింగ్ పెట్టింది నిజమా కాదా చెప్పాలని మనీష్ సిసోడియాను డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో 14 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నారు. అంతేకాదు మనీష్ సిసోడియా విదేశాలకు వెల్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత లింకులు బయటపడటంతో ఆమె పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చుతారా లేదా అన్నది క్లారిటీ రావడం లేదు. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసులో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయమంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో సీరియస్ గా స్పందిస్తున్నారు.  తెలంగాణ తాగుబోతు కూతురు  ఢిల్లీలోని అక్రమ మద్యం కుంభకోణంలో రింగ్ లీడర్! కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను దోచుకున్న డబ్బుతో అక్రమ మద్యం కుంభకోణం. సీబీఐ  వద్ద అన్ని సాక్షాలు ఉన్నా కూడా కవితని ఇంకా ఎందుకు అరెస్ట్ చెయ్యడం లేదు? అంటూ తెలంగాణ కాంగ్రెస్ అఫిషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను కేసిఆర్ కలిసింది మద్యం దందా గురించేనని ఆరోపించింది కాంగ్రెస్. వేల కోట్ల మద్యం కుంభకోణం లో కేసిఆర్ కుటుంబం పాత్ర స్పష్టంగా ఉందని తెలిపింది. తన కుటుంబాన్ని రక్షించుకుందెందుకు, కేసిఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ తో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించింది. సీఎం కేసిఆర్ దొంగైతే, ఈ దొంగ ను కాపాడే గజ దొంగ పీఎం మోడీ అంటూ ఘాటుగా కామెంట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. కేసిఆర్ కుటుంబం చేస్తున్న కుంభకోణాలు ఆధారాలతో సహా వెలుగులోకి వస్తుంటే, కనీసం ఒక్క సీబీఐ దర్యాప్తు కూడా జరగడం లేదని.. ఇదే టీఆర్ఎస్, బీజేపీ మధ్య కుదిరిన చీకటి ఒప్పందానికి నిదర్శనమని కామెంట్ చేసింది.

మరోవైపు గత మే నెలలో ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ ఇచ్చిన లంచ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం బయటికి రావడం.. కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందన్న వార్తలు వస్తుండటంతో కేసీఆర్, కేజ్రీవాల్ మీటింగ్ పైనా కమలం నేతలు పలు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ పాలసీ గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి.

Also read:Pawan Fans Unhappy with Amit Shah: ఎన్టీఆర్ కు ఆహ్వానమా? అసంతృప్తితో పవన్ ఫాన్స్!

Also read:Amit Shah Munugode: కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం..కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News