Sim Numbers: మీ పేరున ఎన్ని మొబైల్ సిమ్‌లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి

Sim Numbers: మనకు తెలిసో తెలియకో..లేదా మన ఐడీ ప్రూఫ్‌లు పొరపాటున ఎక్కడైనా మిస్ ప్లేస్ అయినా...మన పేరు మీద మనకు తెలియకుండా మొబైల్ సిమ్ తీసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకోవడం. మీకు తెలియకుండా మీ పేరున ఉన్న సిమ్ వివరాలు ఇలా తెలుసుకోవచ్చు  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2021, 06:51 PM IST
Sim Numbers: మీ పేరున ఎన్ని మొబైల్ సిమ్‌లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి

Sim Numbers: మనకు తెలిసో తెలియకో..లేదా మన ఐడీ ప్రూఫ్‌లు పొరపాటున ఎక్కడైనా మిస్ ప్లేస్ అయినా...మన పేరు మీద మనకు తెలియకుండా మొబైల్ సిమ్ తీసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకోవడం. మీకు తెలియకుండా మీ పేరున ఉన్న సిమ్ వివరాలు ఇలా తెలుసుకోవచ్చు

సాధారణంగా మన ఆధార్ కార్డు జిరాక్స్(Aadhar xerox) లేదా ఐడీ ప్రూఫ్ జిరాక్స్‌లు ఎక్కడెక్కడో మిస్ చేస్తుంటాం. చాలా తేలిగ్గా తీసుకుంటాం వాటిని. కానీ సైబర్ నేరగాళ్లు ( Cyber Criminals) వీటిపైనే దృష్టి పెడుతుంటారు. ఇలాంటివాటి ఆధారంగా మనకు తెలియకుండా మన పేరున సిమ్‌లు తీసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తుంటారు. లేదా మన ప్రైవసీని చోరీ చేస్తుంటారు. అందుకే మన పేరున మనకు తెలియకుండా అసలెన్ని సిమ్ నెంబర్లున్నాయో ( Hom many sim numbers on our name) ఎలా తెలుసుకోవడం. దీనికి సమాదానమే విజయవాడ టెలీకం విభాగం రూపొందించిన వెబ్‌సైట్. 

మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు లభిస్తోంది. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(Vijayawada Telecom Department) రూపొందించిన వెబ్‌సైట్‌ https://tafcop.dgtelecom.gov.in ను సందర్శించాలి. వెబ్‌సైట్‌ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్‌ నంబర్ల ( Mobile numbers) వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలెక్ట్‌ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. 

వాస్తవానికి ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుందని విజయవాడ టెలికం శాఖ చెబుతోంది. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామని అంటోంది. ఈ వెబ్‌సైట్ ద్వారా అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. 

Also read: PF Balance: యూఏఎన్ నెంబర్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News