College Building Collapsed: భారీ వర్షాలకు పేక మేడలా కుప్పకూలిన డిఫెన్స్ కాలేజ్ బిల్డింగ్

Dehradun Defence College Building Collapsed: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, రిషికేష్‌లోనూ ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చోట స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. 

Written by - Pavan | Last Updated : Aug 14, 2023, 03:33 PM IST
College Building Collapsed: భారీ వర్షాలకు పేక మేడలా కుప్పకూలిన డిఫెన్స్ కాలేజ్ బిల్డింగ్

Dehradun Defence College Building Collapsed: ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయి దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో ఆగస్టు 12 నుండే ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గర్వాల్ ప్రాంతంలో వర్షాపాతం మరింత అధికంగా ఉంది. ఇక నైనితాల్, డెహ్రాడూన్ వంటి పర్యాటక ప్రాంతాలు సహా తేహ్రి, పారి, చంపావత్, ఉధం సింగ్ నగర్ మొత్తం ఆరు జిల్లాలకు ఆదివారం, శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. 

ఈ నేపథ్యంలోనే డెహ్రాడూన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక డిఫెన్స్ కాలేజీ బిల్డింగ్ పేక మేడలా కుప్పకూలింది. అంత భారీ బిల్డింగ్ చూస్తుండగానే నీళ్లలో కుప్పకూలిపోవడంతో నీళ్లు సైతం ఉవ్వెత్తున కెరటాల్లా లేచిపడ్డాయి. భారీ భవనం కుప్పకూలిన దృశ్యాలను తమ కెమెరాలో బంధించిన వాళ్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాలేజీ బిల్డింగ్ ప్రధాన భాగం కుప్పకూలగా మిగతా భాగం పాక్షికంగా దెబ్బతింది. మిగతా భాగం కూడా ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది అని అక్కడి పరిస్థితి చూస్తోంటే అర్థం అవుతోంది.

 

అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ మొత్తంలో ప్రాణ నష్టం సంభవించి ఉండేదే అని అధికారులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, రిషికేష్ లోనూ ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చోట స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. 

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని అనేక జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు మూసేశారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో అనేక మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రెస్క్యూ ఆపరేషన్ కి ఇది కూడా ఒక అడ్డంకిగా మారుతోంది అని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. అధికారులు సైతం ప్రాణ నష్టం నివారించేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపేశారు. 

ఇది కూడా చదవండి : Himachal Pradesh Rains: శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి

తేహ్రి జిల్లాలోని కుంజపురి బగర్దర్ వద్ద కొండచరియలు విరిగిపడుతుండటంతో రిషికేష్ - చంబ జాతీయ రహదారిపై రాకపోకలు ఆపేశారు. రిషికేష్ - దేవ్ ప్రయాగ్ - శ్రీనగర్ లను కలిపే జాతీయ రహాదారిపై సైతం అక్కడక్కడా కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఉత్తరాఖండ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికార యంత్రాంగం అందించిన వివరాల ప్రకారం ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా మొత్తం 60 మంది వరకు ప్రాణాలు కోల్పోగా 37 మంది గాయపడ్డారు. మరో 17 మంది ఆచూకీ గల్లంతయ్యారు.

ఇది కూడా చదవండి : Himachal Pradesh Rains: హిమాచల్‌లో కుండపోత వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News