దారుణం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళా టిక్‌టాకర్‌పై 300 వందల మంది దాడి!

అది ఆగష్టు ఆగస్ట్ 14 2021 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం, 300 వందల మంది ఒకేసారి మహిళా టిక్‌టాకర్‌ పై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన (వీడియో) సోషల్ మీడియాలో వైరలైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 05:27 PM IST
  • పాకిస్థాన్ మహిళా టిక్‌టాకర్‌పై 300 వందల దాడి
  • స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఘటన
  • వీడియో చూసి ఆగ్రహానికి గురవుతున్న నెటిజన్లు
దారుణం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళా టిక్‌టాకర్‌పై 300 వందల మంది దాడి!

దేశం, మతం, కులం, ప్రాంతం ఏదైనా కానీవ్వండి మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గటం లేదు. పాకిస్తాన్ లో ఒక యువతి పైన జరిగిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. యువతిపైన ఒకేసారి 300 మంది దాడి చేయటం అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం (Independence day) రోజు ఈ ఘటన చోటు చేసుకోవటం అందరిని ఆగ్రహానికి గురి చేస్తుంది. 

పాకిస్థాన్ (Pakistan) లాహోర్ (Lahore) లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ఓ మహిళ టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఘటన సంబంధిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం శృష్టిస్తుంది. 

Also Read: Bigg Boss: బిగ్‌బాస్‌ లోకి తీసుకోలేదని రోడ్లపై ప్రముఖ నటి హల్‌చల్‌.. వైరల్ అవుతున్న వీడియో!

"అది ఆగస్ట్ 14 2021 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం (Pakistan independence day) రోజున తన స్నేహితురాళ్లతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ (Minar e pakistan) వద్ద టిక్‌టాక్ లో వీడియో తీస్తుంది. అది చూసిన 300 మంది ఒకేసారి ఆమెను చుట్టు ముట్టి దాడి చేసారు. అమ్మాయని కూడా చూడకుండా, టిక్‌టాకర్‌ను అటు-ఉటు లాగుతూ, గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించటానికి ప్రయత్నించారు. 

అంతేకాకుండా, ఆమె చేతికి ఉన్న ఉంగరం, చెవి కమ్మలు,స్నేహితుల మొబైల్ ఫోన్లు, దాదాపు 15 వేల రూపాయలు లాక్కున్నారు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్థాన్ గేటు (Minar e pakistan) తెరవటంతో టిక్‌టాకర్‌ మరియు ఆమె స్నేహితులు అక్కడి నుండి తప్పించుకున్నారు. 

Also Read: Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్‌లో 39 ఏళ్ల రికార్డు సమం చేసిన టీమ్ ఇండియా పేసర్ సిరాజ్
తరువాత యువతి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురై కామెంట్స్ చేస్తూ యువతికి మద్దతు తెలుపుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News