Flight Engine Catches Fire: ఈ వీడియో చూస్తే.. జన్మలో ఇక విమానం కూడా ఎక్కరు

Flight Engine Catches Fire: విమానం ఇంకొన్ని క్షణాల్లో గాల్లోకి టేకాఫ్ అవుతుందనగా.. ఆ విమానం ఇంజన్లో మంటలు చెలరేగితే.. ఆ మంటలను వారు తమ కళ్లారా చూస్తే.. అందులో కూర్చున్న వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఘటన విషయంలోనూ అలాగే జరిగింది.

Written by - Pavan | Last Updated : May 9, 2023, 03:04 AM IST
Flight Engine Catches Fire: ఈ వీడియో చూస్తే.. జన్మలో ఇక విమానం కూడా ఎక్కరు

Flight Engine Catches Fire: మామూలుగానే విమాన ప్రయాణాలు అంటే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. దీనినే వైజ్ఞానిక పరిభాషలో ఏరోఫోబియా అంటుంటారు. విమానం ఎక్కేటప్పుడు మొదలుపెడితే.. విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు, విమానం గాల్లో ఉన్నప్పుడు, విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు.. ఇలా విమాన ప్రయాణంలో తమకు ఏదో అయిపోతుందనే భయాన్నే ఏరోఫోబియా అంటారన్నామాట. ఈ ఏరోఫోబియా ఉన్న వారిలో చాలామందికి ఆ భయం కలగడానికి కారణం ఏంటంటే.. గతంలో సినిమాల్లోనో లేక నిజంగా జరిగిన విమాన ప్రమాదాలను వార్తల్లో చూడటం వల్లో విమానం ఎక్కితే అలా జరుగుతుందా అనే భయంతో వచ్చే ఆలోచనలే అందుకు కారణం అవుతాయి. 

ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా అలాంటిదే. ఒక విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చింది. రన్ వే పై టేకాఫ్ మోషన్ తీసుకుని గాల్లో ఎగిరేందుకు ముందుకు పరుగెడుతోంది. ఇంతలోనే విమానం కిటికిలోంచి విమానం రెక్కలవైపే చూస్తూ విమానం టేకాఫ్ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధిస్తున్న ప్రయాణికులకు ఒక టెర్రిఫిక్ సీన్ కనిపించింది. అదేంటంటే.. విమానం రెక్కల కిందున్న ఇంజన్‌లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విమానం ఇంకొన్ని క్షణాల్లో గాల్లోకి టేకాఫ్ అవుతుందనగా.. ఆ విమానం ఇంజన్లో మంటలు చెలరేగితే.. ఆ మంటలను వారు తమ కళ్లారా చూస్తే.. అందులో కూర్చున్న వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఘటన విషయంలోనూ అలాగే జరిగింది. ప్రయాణికులు అరుపులు, కేకలకు తోడు జరిగిన ప్రమాదాన్ని పైలట్ కూడా గమనించడంతో విమానం టేకాఫ్ అవకుండా నిలిపేశారు. ఆ తరువాత విమానాన్ని సేఫ్ ప్లేస్ లోకి తీసుకెళ్లి ప్రయాణికులను అందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Carol Hermes (@carolthermes)

ఇది కూడా చదవండి : Amrita Arora Oops Moment: ఆ డ్రెస్సులో కారు దిగేందుకు ఇబ్బందిపడిన హీరోయిన్ ఊప్స్ మూమెంట్.. కాచుకుని కూర్చున్న కెమెరాలు

బ్రెజిల్‌లోని శాంటోస్ డూమాంట్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రెజిల్‌కే చెందిన గోల్ లిన్హాస్ ఏరియాస్ ఇంటెలిజెంట్స్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం రియో డి జాన్రో నుంచి పోర్టో అలెగ్రెకు వెళ్తుండగా విమానం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. అన్నట్టు బ్రెజిల్లో చౌక ధరలకే ఫ్లైట్ టికెట్స్ ఆఫర్ చేసే ఎయిర్ లైన్స్ కూడా ఇదే కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి : Horrible Road Accident: భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్.. అతి వేగంగా వచ్చి పోలీసుని ఢీకొట్టిన కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News