TTD Guidelines: తిరుపతి స్థానిక నివాసితులకు శ్రీవారి దర్శనం కోసం టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానిక భక్తులకు స్వామి దర్శనం లభించనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను టీటీడీ విడుదల చేసింది. ఇవి డిసెంబర్ 3 నుంచి అమల్లో రానున్నాయి.
తిరుపతి భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంది. స్థానిక భక్తులకు ఇక నుంచి ప్రతి నెలా మొదటి మంగళవారం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉంటాయి. ఈ దర్శనానికి సంబంధించి డిసెంబర్ 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలులో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ అవుతాయి. మొత్తం 3 వేల టోకెన్లు జారీ కానున్నాయి. దర్శన టోకెన్లు ఎవరెవరికి, ఏ ప్రాతిపదికన అనే విషయమై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ ప్రయారిటీతో టోకెన్లు జారీ అవుతాయి. ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
టోకెన్ పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుట్‌పాత్ హాల్ క్యూ లైన్‌లో భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. దర్శనం తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డూ ఉచితంగా ఇస్తారు. స్థానిక కోటా పూర్తయిన 90 రోజుల వరకూ రెండోసారి అవకాశముండదు.
ప్రస్తుతం అయితే ఫెంగల్ తుపాను కారమంగా తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచిరయలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. మరోవైపు జలాశయాలు నిండి జలకళను సంతరించుకున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రదాన నీటి వనరులుగా ఉన్నాయి. దాంతో 7 నెలల వరకూ తిరుమల దాహార్తి తీరనుంది. ప్రస్తుతం విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
Also read: AP Weather Forecast: బలహీనపడుతున్న తుపాను, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.