Google New Logo: గూగుల్.. లోగో మార్చానంటోంది..మీరేమైనా గుర్తు పట్టగలరా..ట్రై చేయండి

Google New Logo: ప్రముఖ బ్రౌజింగ్ యాప్ గూగుల్ క్రోమో లోగోలో మరోసారి మార్పులు చేరాయి. అప్పుడప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్ 8 ఏళ్ల తరువాత స్వల్ప మార్పులు చేసింది. ఆ మార్పులేంటనేది గుర్తు పట్టగలరా లేదా  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2022, 07:32 AM IST
Google New Logo: గూగుల్.. లోగో మార్చానంటోంది..మీరేమైనా గుర్తు పట్టగలరా..ట్రై చేయండి

Google New Logo: ప్రముఖ బ్రౌజింగ్ యాప్ గూగుల్ క్రోమో లోగోలో మరోసారి మార్పులు చేరాయి. అప్పుడప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్ 8 ఏళ్ల తరువాత స్వల్ప మార్పులు చేసింది. ఆ మార్పులేంటనేది గుర్తు పట్టగలరా లేదా

గూగుల్ అనే పదం తెలియనివారెవరూ ఉండరు. ప్రస్తుతం అన్నింటికీ గూగుల్ ఆధారమైంది. ఆఖరికి నెట్ కనెక్షన్ ఉందో లేదో చూడాలన్నా కూడా గూగుల్ ఆశ్రయిస్తుంటారు. అటు గూగుల్ సంస్థ కూడా కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది. తరచూ లోగో మారుస్తుంటుంది. దాదాపు 8 ఏళ్ల తరువాత గూగుల్ లోగో మరోసారి మారింది. గూగుల్ లోగో అనగానే గురొచ్చేది రౌండ్ షేప్‌లో ఉండే ఓ ఆకారం. అప్పుడప్పుడూ ఈ ఆకారంలో స్వల్ప మార్పులు వస్తూ ఉన్నాయి. గతంలో 2014లో గూగుల్ తన లోగోలో మార్పులు చేసింది. తిరిగి ఇప్పుడు లోగోలో స్వల్ప మార్పులు చేసింది. అయితే ఆ మార్పులేవో తెలుసుకునేందుకు నెటిజన్లు , కస్టమర్లు అంతా తలకిందులవుతున్నారు. లోగో మార్చానంటూ చెప్పి..వినియోగదారులకు పరీక్ష పెట్టింది గూగుల్. 

గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు ట్విట్టర్ వేదికగా కొత్త లోగోను షేర్ చేశారు. క్రోమ్ కొత్త ఐకాన్ గమనించారా..8 ఏళ్ల తరువాత తిరిగి ఐకాన్ రీఫ్రెష్ అయిందంటూ పోస్ట్ చేశాడు. అయితే గూగుల్ తన లోగోను ఎక్కడ మార్చిందో అర్ధం కాక నెటిజన్లకు బుర్ర పాడవుతుంది. ఎందుకంటే మామాలుగా చూస్తే రెండు లోగోల్లో ఏ మార్పులూ కన్పించవు. గూగుల్ చెప్పింది కాబట్టి మార్పులెక్కడున్నాయనేది పరిశీలించాల్సి ఉంటుంది . మార్పులు ఎక్కడున్నాయనే కోణంలో పరిశీలిస్తేనే ఆ మార్పులేంటో కన్పించే పరిస్థితి. అందుకే గూగుల్ లోగో మార్పు విషయమై అప్పుడే మీమ్స్ కూడా ప్రచారమౌతున్నాయి. 

గూగుల్ లోగోల్లో ఉన్న తేడా ఏంటి

గూగుల్ లోగోలో (Google logo) నిజానికి చాలా స్వల్ప మార్పులున్నాయి. అది కూడా బేసిక్ ఆకారంలో ఏ విధమైన మార్పు లేదు. మైన్యూట్ ఛేంజెస్ కావడం వల్లనే ఎవరూ గుర్తు పట్టలేకపోతున్నారు. లోగోలో ఉండే రెడ్, గ్రీన్, ఎల్లో రంగుల్ని కాస్త బ్రైట్ చేశారు. అదే విధంగా బ్లూ కలర్ సర్కిల్‌ను కాస్త పెద్దది చేసి..బ్రైట్ చేశారు. అంతే ఇదే లోగోలో వచ్చిన మార్పు. క్యాజువల్ గా చూస్తే రెండు లోగోలు ఒకటే కదా అనుకుంటాం. పరిశీలించి చూస్తేనే అర్ధమౌతుంది. అందుకే గూగుల్ లోగో మార్పుపై ఫన్నీ మీమ్స్, కామెంట్లు ట్రోల్ అవుతున్నాయి.

Also read: Woman Fights With Leopard: కన్న బిడ్డ కోసం చిరుతపులితో పోరాడిన మహిళ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News