Trending: టమాటాలకు సెక్యూరిటీగా బౌన్సర్లు.. ముగ్గురిపై కేసు నమోదు..

Trending: టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టి వార్తల్లో నిలిచిన ఎస్పీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా టమాటాల ధరలు ఆకాశాన్నింటుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2023, 11:23 AM IST
Trending: టమాటాలకు సెక్యూరిటీగా బౌన్సర్లు.. ముగ్గురిపై కేసు నమోదు..

Uttar Pradesh Viral: సాధారణంగా సినీప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు బౌన్సర్లు ఉంటారు. కానీ యూపీలోని ఓ ప్రాంతంలో టమాటాలకు కాపలాగా బౌన్సర్లు పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవతోంది. ఈ నేపథ్యంలో బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకున్న వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే..
దేశంలో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. చాలా మంది నేతలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే యూపీ వారణాసికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త అయిన అజయ్ ఫౌజీ డిఫరెంట్ గా నిరసన తెలిపేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం లంక పోలీస్ స్టేషన్ పరిధిలోలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న రాజ్ నారాయణ్, అతడి కుమారుడు వికాస్ ను సంప్రదించాడు. 

వారు ఒప్పుకోవడంతో వారి దుకాణంలోనే కూర్చుని టమాటాలకు రక్షణగా ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని నిరసన చేపట్టాడు అజయ్. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాజ్ నారాయణ్, అతడి కుమారుడు వికాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అజయ్ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని డీసీపీ గౌతమ్ తెలిపారు. 

టమోటాలకు 'జెడ్-ప్లస్' భద్రత కల్పించాలి..

అజయ్ ఎక్కడో రూ. 500 విలువైన టమోటాలు కొని తన కూరగాయల దుకాణం పెట్టుకుని అమ్ముకున్నాడని కూరగాయల వ్యాపారి పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా ఈ షాపులో అజయ్ గత "తొమ్మిదేళ్లుగా" పెరుగుతున్న వస్తువుల ధరలను ప్రస్తావించే ప్లకార్డును కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా టమాటాలు కిలో రూ.140-160 విక్రయించాడు. బౌన్సర్లును ఎంత మెుత్తానికి నియమించుకున్నాడో విషయం తెలియరాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన క్లిప్ ను ట్విట్టర్ లో పంచుకున్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అంతేకాకుండా బీజేపీ టమోటాలకు 'జెడ్-ప్లస్' భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా అరెస్ట్ చేసిన కూరగాయల వ్యాపారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Also  Read: Viral: 2,000 కిలోల టమాటాల వ్యాన్ ను ఎత్తుకెళ్లిన దుండగులు.. రోధిస్తున్న రైతు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News