Swiggy Delivery Boy Caught Stealing Expensive Nike Shoes: మనలో చాలా మంది ప్రస్తుతం స్విగ్గీ, జోమాటోలపై ఆధారపడుతున్నారు. ఇంట్లో వండుకొవడానికి సమయం లేనివారు, ముఖ్యంగా ఇంట్లో ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే ఎక్కువగా ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ సర్వీస్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు మనం ఆర్డర్ పెట్టగానే స్విగ్గీ డెలీవరీ బాయ్ లు వెంటనే ఆర్డర్ లు తెచ్చిపెడుతుంటారు. మరికొందరు మాత్రం ఆలస్యం చేస్తుంటారు. పార్ట్ టైమ్ స్విగ్గీ డెలీవరీ చేస్తునే, ఉదయం పూట కష్టపడి చదివేవాళ్లు చాలా మంది ఉన్నారు. తమ ఖర్చుల కోసం ఇంట్లో వాళ్లమీద ఆధారపడకుండా.. ఇలా ఆన్ లైన్ సర్వీసులపై ఆధారపడి, సర్వీసులు అందిస్తుంటారు.
Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx
— Rohit Arora (@_arorarohit_) April 11, 2024
కొందరు స్విగ్గీ డెలీవరీ బాయ్స్ ఎంతో నిజాయితీగా ఉంటారు. కానీ మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. డెలీవరీ చేయడానికి వచ్చి యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు డెలీవరీ ఫుడ్ లను కూడా తినేస్తుంటారు. ఇక.. కొందరైతే చోరీలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. స్థానికంగా ఒక యువతి స్విగ్గీలో ఆర్డర్ పెట్టింది. అతను ఆర్డర్ పార్శీల్ తీసుకుని ఆ అపార్ట్ మెంట్ చేరుకున్నాడు. అతను రావడంతోనే చుట్టుపక్కల ఉన్నవాటిని దొంగచూపులతో చూస్తున్నాడు. పార్శీల్ ఇవ్వాల్సిన ఇంటి డోర్ బెల్ ను మోగించాడు. కాసేపటికి ఒక యువతి వచ్చి పార్శీల్ తీసుకుంది. కానీ అప్పటికే అతగాడి కళ్లు అక్కడున్న షూస్ మీద పడ్డాయి. యువతి లోపలకు వెళ్లిపోయేవరకు ఏదో ఫోన్ లో చూస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత వెంటనే ఒక టవల్ తీసుకున్నాడు. అక్కడున్న షూస్ మీద వేసి, వాటిని చుట్టేసి లోపల పెట్టుకున్నాడు.
అక్కడి నుంచి మెల్లగా బైటకు జారుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై సదరు కస్టమర్ స్విగ్గీ డెలీవరీ సంస్థకు ఫిర్యాదు చేశాడు.కానీ కంపెనీనుంచి ప్రాపర్ గా రెస్పాన్స్ రాకపోవడంతో సదరు బాధితులు.. ఈ ఘటనకు చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. బాధితులు.. అవి ఆరోజు మా ఇంటికి వచ్చిన స్నేహితుడి షూస్ అని క్లారిటీ ఇచ్చింది. అవి నైక్ కంపెనీకి చెందిన బ్రాండెడ్ షూస్ లని, దాన్ని చోరీ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు సిగ్గీ సంస్థపై ఫైర్ అవుతున్నారు.