Google: కొత్త ప్రొడక్ట్‌పై భారీ అంచనాలు

ఇప్పుడందరి దృష్టి గూగుల్ ( Google ) సంస్థ పైనే పడింది. ఆ సంస్థ లాంచ్ చేయనున్న ప్రొడక్ట్ ( Google new product ) ఏంటనే విషయంపై ఆతృత నెలకొంది. ఇప్పటికే టీజర్ లాంటిది విడుదలవడంతో గూగుల్ ఏం లాంచ్ చేస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారంతా.

Last Updated : Jul 13, 2020, 06:38 PM IST
Google: కొత్త ప్రొడక్ట్‌పై భారీ అంచనాలు

ఇప్పుుడందరి దృష్టి గూగుల్ ( Google ) సంస్థ పైనే పడింది. ఆ సంస్థ లాంచ్ చేయనున్న ప్రొడక్ట్ ( Google new product ) ఏంటనే విషయంపై ఆతృత నెలకొంది. ఇప్పటికే టీజర్ లాంటిది విడుదలవడంతో గూగుల్ ఏం లాంచ్ చేస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారంతా.

ఏదైనా వస్తువును మార్కెట్‌లో ప్రవేశపెట్టే ముందు ప్రకటనలివ్వడం, సినిమా విడుదలకు ముందు టీజర్లు, ఫస్ట్‌లుక్ ( Firstlook ) లు షేర్ చేయడం అందరికీ తెలిసిందే. అదే విధంగా  గూగుల్ ఇటీవల ఓ చిన్న టీజర్ లాంటి వీడియో విడుదల చేసింది. ప్రముఖ కమెడియన్ ఫ్రెడ్ ఆర్మిసెన్ యోగా భంగిమలో ఉన్న వీడియో ఇది. దీర్ఘ శ్వాస తీసుకుని సిద్ధంగా ఉండండి అంటూ గూగుల్ వ్యాఖ్యానం ఈ వీడియోకు జత అయింది. జూలై 13 న కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నట్టు గూగుల్ సంస్థ ( Google company ) ప్రకటించింది. ఈ నేపద్యంలో ఆ ప్రొడక్ట్ ఏంటి? ఎలా ఉంటుంది ? అనే విషయంపై గూగుల్ అభిమానులు, వినియోగదారులకు ఆసక్తి ఎక్కువైంది. గూగుల్ విడుదల చేయబోతున్న ఆ ప్రొడక్ట్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. Also read: Google: భారత్‌లో 75వేల కోట్ల పెట్టుబడులు: సుందర్ పిచాయ్

గూగుల్ లాంచ్ చేయబోతున్న కొత్త ప్రొడక్ట్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ హోమ్ స్పీకర్ ( next generation home smart speaker ) కావచ్చని ఎక్కువ శాతం అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి జపాన్, యూఎస్‌లో ఇప్పటికే ఆ సంస్థ రెగ్యులేటరీ అనుమతుల్ని పొంది ఉంది. ఏదేమైనా మార్కెట్లో గూగుల్ టు బి లాంచింగ్ ప్రొడక్ట్‌పై చాలా అంచనాలున్నాయి. Also read: Indian Bullfrog: రంగులు మార్చే కప్పను చూశారా ?

Trending News