High Demand Jobs in India:
డేటా సైంటిస్ట్
డేటా సైంటిస్ట్ జాబ్ చేసే వారిలో ఏడాదికి రూ. 4 లక్షల శాలరీ ప్యాకేజ్ నుంచి రూ. 12 లక్షల శాలరీ డ్రా చేయడం సర్వసాధారణం. సర్టిఫైడ్ కోర్స్ చేసి, కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నట్టయితే.. వారికి సంవత్సరానికి రూ. 60 లక్షల నుంచి 70 లక్షల వరకు శాలరీ ఉంటుంది.
మెడికల్ ప్రొఫెషనల్స్ ( డాక్టర్స్ , సర్జన్స్ )
వైద్య రంగంలో అత్యంత ఎక్కువ శాలరీ ప్యాకేజెస్ డాక్టర్స్, సర్జన్స్‌కే ఉన్నాయి. వీళ్లకు సంవత్సరానికి కనీసం 12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వారికి ఉన్న డిమాండ్, పని తీరు, సక్సెస్ రేటును బట్టి వారి శాలరీ ఇంకా ఎక్కువే ఉంటుంది.
మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్
మెషిన్ లెర్నింగ్ పని తెలిసిన వారికి ఆరంభంలోనే రూ. 5 లక్షలు నుంచి రూ. 7 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న నిపుణులకు ఏడాదికి రూ. 20 లక్షలు కూడా ఉంటుంది.
కమెర్షియల్ పైలట్
విమానయాన రంగంలో ఆరంభంలోనే పైలట్ శాలరీ రూ. 15 లక్షలతో మొదలవుతూ ఉంటుంది. అది వారికి అనుభవం వచ్చే కొద్దీ.. ఫ్లైట్ కేప్టేన్స్ ఏడాది వేతనం 48 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల వరకు పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Business From Kitchen: 50 ఏళ్ల వయస్సులో కిచెన్ నుంచి బిజినెస్.. నెలకు 20 లక్షల ఆదాయం
ప్రోడక్ట్ మేనేజర్
ఏ రంగంలోనైనా ఒక బిజినెస్ క్లిక్ అవ్వాలి అంటే అది ఆ కంపెనీ ప్రోడక్ట్ మేనేజర్ స్కిల్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ అవసరాలు గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా తమ ప్రోడక్ట్స్‌ని డిజైన్ చేసే వారే ఈ ప్రోడక్ట్ మేనేజర్స్. వీరికి ఏడాదికి రూ. 15 లక్షల నుంచి 26 లక్షల రూపాయల వరకు శాలరీ ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ శాలరీ ఏడాదికి రూ. 30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వారికి ఉన్న అనుభవం, కంపెనీ రేంజ్, బిజినెస్ ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ శాలరీ ఏడాదికి రూ. 90 లక్షల వరకు కూడా ఉంటుంది.
మేనేజ్మెంట్ కన్సల్టెంట్
మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఏడాదికి రూ. 12 లక్షల నుంచి ప్రారంభమైతే.. వారికి ఎక్స్‌పీరియెన్స్ పెరిగే కొద్ది శాలరీ కూడా పెరుగుతూ సంవత్సరానికి రూ. 24 లక్షల కంటే ఎక్కువే డ్రా చేసే వరకు పెరుగుతుంది. కంపెనీ రేంజ్, వ్యక్తుల పని తీరును బట్టి ఇది అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Maruti Invicto: మారుతి నుంచి కొత్త ఎంపీవీ 7 సీటర్కారు.. రూ. 25 వేలు చెల్లించి ఇవాళే బుక్ చేసుకోండి!
చార్టెడ్ అకౌంటెంట్
ఒక చార్టెడ్ అకౌంటెంట్ శాలరీ సంవత్సరానికి రూ. 8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంటుంది. అనుభవం పెరిగే కొద్దీ కనీసం రూ. 20 లక్షల ప్యాకేజ్ వరకు డ్రా చేసే వారు కూడా ఉంటారు. ఇలా క్లయింట్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే.. అంత ఎక్కువ సంపాదన ఆర్జించే అవకాశం కూడా చార్టెడ్ అకౌంటెంట్స్‌కి ఉంటుంది. ఏకకాలంలో ఎక్కువ మంది క్లయింట్స్‌కి సేవలు అందించి, ఎంత ఎక్కువ మంది క్లయింట్స్‌కి సేవలు అందిస్తారో.. అంత ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉన్న ఉపాధి రంగాల్లో ఇది కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే.
బిజినెస్ మేనేజర్
బిజినెస్ మేనేజర్స్ యాన్వల్ శాలరీ ప్యాకేజ్ సగటున 8 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై.. 30 లక్షల వరకు పెరుగుతూ ఉంటుంది.
బ్లాక్‌చైన్ డెవలపర్
బ్లాక్ చైన్ డెవలపర్స్ శాలరీ ఏడాదికి రూ. 8 లక్షల నుంచి ప్రారంభమై.. అనుభవం పెరిగే కొద్దీ ఏడాదికి రూ. 45 లక్షల వరకు పెరుగుతూ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Maruti Suzuki Jimny Vs Mahindra Thar: ఏ కారుకి ఎంత ధర, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook