Right Way To Store National Flag: గతంలో మనం చేసుకున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు, ఈసారి వేడుకలకు ఉన్న తేడా ఏంటంటే.. గతంలో అయితే అన్నిరకాల కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జండా పండగలో తమ భాగస్వామ్యం తీసుకుంటూ తమతమ కార్యాలయాల ఎదుట జాతీయ జండాను ఎగురవేసేవి. ఎక్కడో కొంతమంది తమ ఇళ్లలోనూ జండాను ఎగురవేసి తమ దేశభక్తి భావాన్ని చాటుకునే వారు. కానీ ఈసారి అలా కాదు.. యావత్ దేశం హర్ ఘర్ తిరంగా అయింది. ఎప్పుడూ జండా ఎగురవేసే అవకాశం రానివాళ్లకు కూడా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో గుండెల నిండా దేశభక్తిని నింపుకుని సగర్వంగా జండాను ఎగురవేశారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. మరి ఆగస్టు 15 వేడుకలు పూర్తయ్యాకా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ముగిశాకా మన ఇంటిపై ఎగురవేసిన జాతీయ జండాను ఏం చేయాలి ? జాతీయ జండాను అవమానించకుండా ఎలా భద్రపరచాలనే సందేహాలే చాలామందిని వేధిస్తున్నాయి. అలాంటి వారికోసమే ఇదిగో ఈ కథనం. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి మరి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ముగిసిన అనంతరం జాతీయ జండాను సగౌరవంగా ఎలా భద్రపర్చాలి అనే అంశాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వివరించింది.
Step 1: జాతీయ జండాను పై ఫోటోలో చూపించిన విధంగా హారిజంటల్‌గా పరచాలి. (Image Courtesy - Amrit Mahotsav Twitter)
Step 2: పై ఫోటోలో కనిపిస్తున్న విధంగా కాషాయం రంగు భాగాన్ని, ఆకుపచ్చ రంగు భాగాన్ని తెలుపు రంగులో ఉన్న భాగం కిందకు వచ్చేలా మలచాలి. (Image Courtesy - Amrit Mahotsav Twitter)
Step 3: ఇక్కడ పై ఫోటోలో కనిపిస్తున్న విధంగా జాతీయ జండాను రెండు వైపులా మధ్య భాగం కిందకు వచ్చేలా మలచాలి. ఫోటోలో చూస్తున్నట్టుగా అశోక చక్రం స్పష్టంగా కనిపించాలి. అశోక చక్రం పైన, కింద కాషాయం, ఆకుపచ్చ వర్ణం స్పష్టంగా కనిపించాలి. (Image Courtesy - Amrit Mahotsav Twitter)
Step 4: ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న విధంగా జాతీయ జండాను మలిచిన అనంతరం ఫోటోలో ఉన్న తరహాలోనే అరచేతుల్లో జాతీయ జండాను (National Flag) భద్రపరిచే చోటుకు తీసుకెళ్లాలి. ఆజాదీ కా మహోత్సవ్ ఉత్సవాల అనంతరం ఇంటింటికి ఎగరేసిన జండాను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు కేంద్రం ఈ వివరాలను ట్విటర్ వేదికగా పౌరులు అందరికీ తెలిసేలా వెల్లడించింది. (Image Courtesy - Amrit Mahotsav Twitter)
Also Read : Snake Viral Video: సెకన్ ఆలస్యమైతే..పాము కాటేసేదే, అత్యంత వేగంగా కుమారుడిని రక్షించుకున్న మహిళ, వీడియో వైరల్
Also Read : Viral Video: నడిరోడ్డుపై మహిళ ఓవరాక్షన్, నిరుపేద అమాయకుడిపై దాడి, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook