పాన్ కార్డు ( Pancard ) కావాలా..ఎలా అప్లై చేసుకోవాలో తెలియదా..లేదా ఆలస్యమవుతోందా...ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియదా..అర్జెంటుగా అవసరమా..అయితే ఇలా చేస్తే కేవలం పది నిమిషాల్లో ఇంట్లో కూర్చునే పాన్ కార్డు పొందవచ్చు..చూడండి ఎలాగో..
పాన్ కార్డు కోసం ఇప్పటికీ తిప్పలు పడేవాళ్లు చాలామంది ఉన్నారు. కొంతమందికి అత్యవసరమైనప్పుడు లభించదు. మరి కొందరికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. ఇంకొందరికి వెంటనే రాదు. అందుకే ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ ( Aadhar based E kyc ) ద్వారా పాన్ కార్డు ( Pancard ) జారీ చేసే కొత్త సేవల్ని ఈ మధ్యనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Central Finance minister nirmala sitharaman ) ప్రారంభించారు. ఈ సౌలభ్యం ద్వారా కేవలం పదే పది నిమిషాల్లో మీరు పాన్ కార్డు పొందవచ్చు. మీకు కావల్సిందల్లా మీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే. అయితే మీ ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ డీటైల్స్ ( Date of birth full details ) పూర్తిగా ఉండాలి. మైనర్లకు మాత్రం ఈ పాన్ కార్డు అర్హత లేదు.
ముందుగా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ( Income tax department ) కు చెందిన ఈ ఫైలింగ్ పోర్టల్ ( E filing portal ) www.incometaxindiaefiling.gov.in/ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఎడమ చేతివైపు instant pan through aadhar అనే లింక్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో Get New Pan పై క్లిక్ చేసి...మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. తరువాత Generate Aadhar OTP ను క్లిక్ చేస్తే...మీ ఆధార్ నెంబర్ కు మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. Also read: Thunderstorms: పిడుగు అంటే ఏంటి ? తప్పించుకోవాలంటే ఏం చేయాలి ?
ఓటీపీ ఎంటర్ చేశాక..ఆధార్ వివరాలు ఓసారి సరిచూసుకోండి. మీ ఇ మెయిల్ ఐడీ ( E mail id ) ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే...15 అంకెల acknowledgment నెంబర్ జనరేట్ అవుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన తరువాత పాన్ కార్డు జారీ అవుతుంది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI వద్ద రిజిస్టరైన మీ ఆధార్ వివరాల ద్వారా మీకు ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ పాన్ కార్డును ఈ ప్రక్రియ ద్వారా జారీ చేస్తుంది. మొత్తం ఈ ప్రక్రియకు కేవలం పది నిమిషాలు పడుతుందంతే.
Check status/Download pan ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ ఇ పాన్ కార్డును ( E pan card ) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదే ఈ పాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్ లో మీ ఇ మెయిల్ ఐడీకు కూడా వస్తుంది. Also read: SBI Salary account: ఉంటే ఇవే ఆ ప్రయోజనాలు