SBI Salary account: ఉంటే ఇవే ఆ ప్రయోజనాలు

మీకు ఎస్ బీ ఐలో శాలరీ ఎక్కౌంట్ ( Sbi salary account ) ఉందా..ఉంటే కనుక మీకీ ప్రయోజనాలు లభిస్తాయి. మీరు పనిచేస్తున్న కంపెనీ శాలరీ ఎక్కౌంట్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటే మీరు ఊహించని లాభాల్ని పొందడం ఖాయం. అవేంటో చూద్దామిప్పుడు..

Last Updated : Aug 11, 2020, 07:01 PM IST
SBI Salary account: ఉంటే ఇవే ఆ ప్రయోజనాలు

మీకు ఎస్ బీ ఐలో శాలరీ ఎక్కౌంట్ ( Sbi salary account ) ఉందా..ఉంటే కనుక మీకీ ప్రయోజనాలు లభిస్తాయి. మీరు పనిచేస్తున్న కంపెనీ శాలరీ ఎక్కౌంట్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటే మీరు ఊహించని లాభాల్ని పొందడం ఖాయం. అవేంటో చూద్దామిప్పుడు..

మీరు ఏదైనా కంపెనీలో పని చేస్తున్నారా..శాలరీ ఎక్కౌంట్ ఏ బ్యాంకు నుంచి ఉంది..ఒకవేళ ఆ ఎక్కౌంట్ ఎస్బీఐ నుంచి అయితే మాత్రం మంచి ప్రయోజనాలు కలుగుతాయి.దీని కోసం ఎస్బీఐ  కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ ( sbi corporate salary package ) పేరుతో ప్రవేశపెట్టింది. ఈ ఎక్కౌంట్ ను సిల్వర్ ( Silver ) , గోల్డ్ ( Gold ) , డైమండ్( Diamond ) , ప్లాటినం ( platinum ) పేర్లతో నాలుగు విభాగాల్లో అందిస్తుంది. ఉద్యోగి జీతాన్ని బట్టి ఏదో ఒక విభాగం వర్తిస్తుంది. గ్రాస్ మంత్లీ ఇన్ కమ్ ను బట్టి అక్కౌంట్ ను తీసుకోవచ్చు.

1 లక్ష కంటే ఎక్కువ ఆదాయముంటే..ప్లాటినం, 50వేల నుంచి లక్ష వరకైతే డైమండ్, 25 వేల నుంచి 50 వేల వరకైతే గోల్డ్, పది వేల నుంచి 25 వేల వరకైతే సిల్వర్ అక్కౌంట్ ను ఎస్బీఐ అందిస్తోంది. ఈ ఎక్కౌంట్ ఉన్నవారికి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ( Sbi credit card ) ఇవ్వడమే కాకుండా..ఏ ఏటీఎంలోనైనా అని లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మరోవైపు 20 లక్షల వరకూ వ్యక్తిగత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, 30 లక్షల వరకూ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. Also read: Wax Statue Of Wife: భార్య మైనపు విగ్రహంతో గృహప్రవేశం

ఈ ఎక్కౌంట్ ఉన్నవారు పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్  గానీ, కార్ లోన్ గానీ ఎడ్యుకేషన్ లోన్ గానీ తీసుకుంటే వడ్డీరేట్లు ఆకర్షణీయంగానే ఉంటాయి. లాకర్ ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఉంటుంది. సాలరీ ఎక్కౌంట్  తో పాటు డీ మ్యాట్, ఆన్ లైన్ ట్రేడింగ్ అక్కౌంట్ కూడా లభిస్తాయి.డ్రాప్ట్స్, మల్టీ సిటీ చెక్స్, ఎంఎంఎస్ అలర్ట్స్ ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్రయోజనాలు పొందేందుకు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( state bank of india ) ఎస్బీఐ శాలరీ ఎక్కౌంట్ కావాలనుకుంటే మీ కంపెనీ ద్వారానే బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. Also read: Rare Animal in Western Ghats: అత్యంత అరుదైన జంతువిది..పేరేంటో తెలుసా

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x