How to Remove Termites: వర్షాకాలంలో సాధారణంగానే చాలా రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా వుడెన్ ఫర్నీచర్ ఉంటే మరింత ప్రమాదం. తేమ కారణంగా చెద పురుగులు విలువైన వుడెన్ ఫర్నీచర్ నాశనం చేస్తుంటాయి. వర్షాకాలంలో చెద పురుగులు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. సకాలంలో వీటిని చెక్ చెప్పకపోతే తీవ్ర నష్టమే ఎదురౌతుంది.
వాస్తవానికి చెద పురుగులు అంతం చేసేందుకు మార్కెట్లో చాలా రకాల రసాయన పద్ధతులు ఉన్నాయి. అయితే ఇదొక ప్రహసనం. చెద మందు కొట్టించాలంటే కనీసం ఒక రోజు ఇంటిని వదిలేయాలి. అదే సమయంలో ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అందుకే సహజసిద్ధమైన పద్ధతుల్లో చెద పురుగుల్ని నివారించగలిగితే మంచిది. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం.
చెద పురుగుల్ని తొలగించేందుకు చాలా పద్ధతులున్నాయి. అందులో ఒకటి వైట్ సిర్కా. ఇందులో ఎసిడిక్ గుణాలు ఎక్కువ. దాంతో చెద పురుగుల్ని అంతం చేస్తుంది. వైట్ సిర్కాలో నీళ్లు కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఫర్నీచర్‌పై ఎక్కడెక్కడ చెద పట్టిందో ఆయా ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. క్షణాల్లోనే చెద పురుగులు చనిపోతాయి. రెండవ పద్ధతి ఆరెంజ్ తొక్కలు. ఇందులో ఉండే ఆయిల్ చెద పరుగులకు పడదు. మీరు చేయాల్సిందల్లా ఈ తొక్కల్ని ఆరబెట్టి పౌడర్ చేయాలి. నీళ్లలో కలిపి స్ప్రే చేయాలి. లేదా నారింజ తొక్కల కాడా తయారు చేసి కూడా స్ప్రే చేయవచ్చు.
వెల్లుల్లి మరో అద్బుతమైన చిట్కా. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చెద పురుగుల్ని దూరం చేస్తాయి. ఫర్నీచర్‌కు పట్టే చెదను తొలగించేందుకు వెల్లుల్లి రెమ్మల్ని నూరుకుని నీళ్లలో కలిపి స్ప్రే చేసుకోవాలి. మరో పద్ధతి బోరిక్ యాసిడ్. ఇదొక నేచురల్ క్రిమి సంహారిణి. చెద పురుగుల్ని చంపేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని నీళ్లలో కలిపి స్ప్రే చేసుకోవాలి. బోరిక్ యాసిడ్ పిల్లలకు దూరంగా ఉంచాలి.
ఇక అన్నింటికంటే బెస్ట్ వేప నూనె. ఇందులో క్రిమి సంహారక గుణాలు చాలా ఎక్కువ. నీళ్లలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. చెద పరుగుల్ని అంతం చేస్తుంది. రోజుకు ఒకసారి స్ప్రే చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
Also read: Hemoglobin Deficiency: శరీరంలో హిమోగ్లోబిన్ ఎందుకు లోపిస్తుంది, ఐదు ప్రధాన కారణాలివే
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook