Hemoglobin Deficiency: హిమోగ్లోబిన్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన ప్రోటీన్. శరీరంలో అన్ని అంగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేది ఇదే.అందుకే హిమోగ్లోబిన్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఏ మాత్రం తక్కువైనా ఆక్సిజన్ సరఫరాలో సమస్య వస్తుంది. దాంతో వివిధ రకాల వ్యాధులు ప్రారంభమౌతాయి.
హిమోగ్లోబిన్ అవసరమేంటి, లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ఏయే సమస్యలు రావచ్చనేది చాలామందికి తెలిసిందే. కానీ అసలు లోపం ఎందుకొస్తుందనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ కారణాలేంటనేది మనం పరిశీలిద్దాం. హిమోగ్లోబిన్ లోపం అనేది ఎనీమియాకు దారి తీస్తుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఐరన్ లోపం, విటమిన్ లోపం, రక్త ప్రవాహం ఎక్కువగా ఉండటం ఇలా చాలా అంశాలు ఇమిడి ఉంటాయి.
ఆహారపు అలవాట్లలో మార్పులు ఓ ప్రధాన కారణం కావచ్చు. అంటే తినే ఆహారంలో ఐరన్, విటమిన్లు సమృద్ధిగా లేకుంటే హిమోగ్లోబిన్ లోపం తలెత్తుతుంది. క్రానిక్ వ్యాధులు కూడా ఓ కారణం. అంటే కిడ్నీ వ్యాధులు, కేన్సర్ వంటి వ్యాధుల కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ కు మూలం ఐరన్, ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. క్రమంగా ఇది ఎనీమియాకు దారితీస్తుంది.
శరీరంలో హిమోగ్లోబిన్ ప్రోటీన్ లోపానికి మరో ముఖ్య కారణం విటమిన్ల లోపం. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ తగ్గడం. ఈ రెండూ తగ్గడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఎనీమియా తలెత్తుతుంది. ఇక ఎక్కువగా బ్లీడింగ్ జరగడం మరో కారణం. అంటే మహిళల్లో అయితే పీరియడ్స్, సర్జరీ సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొందరికి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా హిమోగ్లోబిన్ లోపానికి ప్రధాన కారణం.
హిమోగ్లోబిన్ లోపం తలెత్తకుండా ఉండాలంటే ముందుగా చేయాల్సింది ఆహారపు అలవాట్లలో మార్పులు. దీనికోసం పాలకూర, బీట్ రూట్, అంజీర్, పప్పులు, మాంసం, చికెన్ వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, గుడ్లు, ఆకు కూరలు, ఆరెంజ్ తరచూ తీసుకోవాలి.
సాధారణంగా హిమోగ్లోబిన్ లోపముంటే తీవ్రమైన అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పసుపుగా మారడం, తలనొప్పి, గుండె చప్పుడు తీవ్రమవడం ఉంటాయి.
Also read: Diseases and Symptoms: ముఖంపై ఈ 5 లక్షణాలు 5 సీరియస్ వ్యాధులకు సంకేతాలా, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook