Hug Costs Rs 7k: అతడి కౌగిలింతకు రూ.7 వేలు.. చిటికలో ఆ సమస్య మటుమాయం! ఎగబడుతున్న జనం

UK man Trevor Hooton charges 7 thousand for hug. ప్రొఫెషనల్ హగ్గర్ అయిన హూటన్.. పలు సమస్యలతో బాధడుతున్న వారిని హగ్ చేసుకుని ఒత్తిడి తగ్గిస్తున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 16, 2022, 07:04 PM IST
  • అతడి కౌగిలింతకు రూ.7 వేలు
  • చిటికలో ఆ సమస్య మటుమాయం
  • ఎగబడుతున్న జనం
Hug Costs Rs 7k: అతడి కౌగిలింతకు రూ.7 వేలు.. చిటికలో ఆ సమస్య మటుమాయం! ఎగబడుతున్న జనం

UK man Trevor Hooton charges 7 thousand for An hour long hug: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఉరుకుల పరుగుల మీద గడుస్తోంది. ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. సరదాగా కుటుంబంతో కలిసి ఉండే సమయం కూడా కొందరికి దొరకదు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో ఎదురయ్యే అనేక సమస్యలతో చాలా మంది ఒత్తిడిని అనుభవిస్తుంటారు. అలాంటి వారు ఓ కౌగిలింతతో ఒత్తిడినంతా జయించొచ్చు. అయితే దానికి ఖర్చవుతుంది మరి. గంటసేపు కౌగిలింతకు రూ.7 వేలు ఖర్చు అవుతుంది. విషయంలోకి వెళితే...

ప్రేమ స్పర్శ లేకుంటే పిల్లలు కూడా అభివృద్ధి చెందరని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఇందుకు పెద్దలు మినహాయింపు ఏమీ కాదు. కౌగిలింత అందరికీ మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందుకే ట్రేవర్ హూటన్ అనే వ్యక్తి 'కౌగిలింత' అనే సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రొఫెషనల్ హగ్గర్ అయిన హూటన్.. పలు సమస్యలతో బాధడుతున్న వారిని హగ్ చేసుకుని ఒత్తిడి తగ్గిస్తున్నాడు. అయితే అతడి హగ్‌కు ఒక్కో గంటకు £75 (రూ. 7,100) ఖర్చు అవుతుంది. 

యూకేని బ్రిస్టల్‌లో నివసించే ట్రేవర్ హూటన్.. తన క్లయింట్‌లకు మంచి అనుభూతిని, ఓదార్పుని అందిస్తున్నాడు. హూటన్ కేవలం హగ్ మాత్రమే కాకూండా సంబంధాలను ఏర్పరచుకోవడాన్ని కష్టంగా భావించే వ్యక్తుల కోసం 'కనెక్షన్స్ కోచింగ్' కూడా అందిస్తున్నాడు. హూటన్ కౌగిలింతల కోసం అక్కడి జనాలు ఎగబడుతున్నారట. గంటసేపు అతడి కౌగిలి కోసం రూ.7,000 కూడా చెల్లించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం హూటన్ వ్యాపారం జోరుగా కొనసాగుతోందట. 

ట్రేవర్ హూటన్ మాట్లాడుతూ... 'మానవ సంబంధాలను పెంపొందించడంపై నా అభిరుచి ఆధారంగా నేను వ్యాపారాన్ని ప్రారంభించా. చాలా మంది వ్యక్తులు ఈ వృత్తిని అర్థం చేసుకోలేరు. దీనిని ఒక సెక్స్ వర్క్‌కి సంబంధించినదిగా పొరబడుతుంటారు. వాస్తవానికి కౌగిలించుకోవడం అనేది ట్రీట్మెంట్‌లో ఒక భాగం. క్లయింట్స్‌కు నాన్-సెక్సువల్ స్పూనింగ్, ఆర్మ్ టిక్లింగ్, ఆలింగనాలను అందిస్తాను. నేటి ప్రపంచానికి ఇది అవసరం. లింక్డ్ఇన్ ఖాతా నా ప్రచారానికి బాగా ఉపయోగపడుతుంది' అని తెలిపాడు. 

Also Read: Goat Crying Video: యజమానిని కౌగిలించుకుని ఏడ్చేసిన మేక.. హృదయాలను పిండేస్తున్న దృశ్యం!  

Also Read: PM Modi: దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరం..యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News