Venue, Tata Nano Accident: హ్యూందాయ్ వెన్యూ, నానో కారు యాక్సిడెంట్.. వెన్యూ కారు ఎలా అయిందో చూడండి

Hyundai Venue Hits Tata Nano: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఎదురైనప్పుడే చాలా మందికి వారు ఉపయోగిస్తున్న వాహనాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. వాస్తవానికి చాలామంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే వారి వారి వాహనాలు ఎంత స్టాండర్డ్ గా ఉంటాయనే విషయంలో ఒక అంచనాకు వస్తుంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 10:03 PM IST
Venue, Tata Nano Accident: హ్యూందాయ్ వెన్యూ, నానో కారు యాక్సిడెంట్.. వెన్యూ కారు ఎలా అయిందో చూడండి

Hyundai Venue Hits Tata Nano: సాధారణంగా యాక్సిడెంట్ అయిన తీరుతెన్నులు, అవతలి వాహనాన్ని బట్టి రోడ్డు ప్రమాదాల్లో వాహనాలు డ్యామేజ్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా రెండు వాహనాలు ఢీకొన్న ఘటనల్లో.. అవతలి వాహనం పెద్దది, ధృడమైనది అయితే.. ఇవతలి వాహనం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఏ వాహనం ఎక్కువ ధృడమైంది అనే చర్చ కూడా మొదలవుతుంది. 

ఇటీవల జమ్మూలో ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హ్యుందాయ్ వెన్యూ కారును టాటా నానో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. సాధారణంగా నానో కారు, హ్యూందాయ్ వెన్యూ కార్లు ఢీకొన్నాయంటే ఎవరైనా ఏమనుకుంటారు.. కచ్చితంగా నానో కారుకే ఎక్కువ డ్యామేజ్ జరిగి ఉండి ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ ఘటనలో అలా జరగలేదు. హ్యూందాయ్ వెన్యూ కారుకే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. హ్యూందాయ్ కారులో ఎయిక్ బ్యాగ్స్ ఓపెన్ అవడం ఈ ఫోటోలో చూడవచ్చు. డ్యామేజ్ పరంగా నానో కారు వెనుక భాగంలో యాక్సిల్ విరిగిపోయింది. ఒకరకంగా నానో కారు కూడా బాగానే దెబ్బతిన్నప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు సేఫ్. వెన్యూ కారు డ్యామేజ్ జరిగిన తీరు చూసిన జనం ఈ రెండు కార్ల సేఫ్టీపై చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

టాటా నానో కారును ఢీకొన్న హ్యూందాయ్ వెన్యూ కారు అంత డ్యామేజ్ అవడానికి టాటా నానో కారు బిల్డ్ క్వాలిటీనే కారణం అనే టాక్ వినిపించింది. సోషల్ మీడియాలో కూడా ఇదే రకమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో కనిపించాయి. కానీ వాస్తవానికి సాంకేతికంగా అసలు కారణం వేరే ఉంది. 

అదేంటంటే.. కార్ల క్రంపుల్ జోన్ అంటే... A పిల్లర్‌కు ముందు ఉన్న కారు ముందు భాగం దేనినైనా ఢీకొన్నప్పుడు అది నలిగిపోయే విధంగా రూపొందించడం జరుగుతుంది. అలా నలిగిపోలేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం ప్రభావం కారులో ప్రయాణిస్తున్న వారిపై పడుతుంది. హ్యూందాయ్ వెన్యూ కారు డ్యామేజ్ అవడానికి కారణం కూడా అదే. కారు అలా డ్యామేజ్ కాకపోతే ఆ ప్రమాదం కారులో కూర్చున్న వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అది నివారించడానికే కార్ల తయారీలో క్రంపుల్ జోన్‌ని అలా తయారు చేస్తారు. అదండీ అసలు సంగతి!!

Trending News