Megalodon Facts: మన భూమి అనేది అద్భుతమైన జీవవైవిధ్యానికి నిలయం. కొన్ని జీవులు మన కళ్ళకు కనిపిస్తాయి, మరికొన్ని చాలా చిన్నవి కాబట్టి మనకు కనిపించవు. కొన్ని జీవులు అడవుల్లో, పర్వతాల్లో ఉంటే, మరికొన్ని సముద్రాల లోతుల్లో, నదుల్లో ఉంటాయి. అయితే అంతరిక్షంలో ఏముందో తెలుసుకోవడం ఎంత కష్టమో సముద్రపు లోతుల్లో ఏముందో కనిపెట్టడం కూడా అంతే కష్టం. మనకు కొన్ని సముద్ర జంతువుల కొంత వరకు తెలుసు కానీ డిపొషన్‌లో ఉండే జీవుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటిదే ఈరోజు మనం ఒక అతిపెద్ద జీవి సముద్రగర్భంలో సైంటిస్టులకు సవాల్ గా మారింది. ఇంతకీ ఆ జీవి ఏంటో? వివరాలు ఇలా..
మెగాలోడాన్ షార్క్ సముద్ర జీవులులో అతిపెద్ద షార్క్. ఇది చూసేందుకు వైట్ షార్క్‌లాగే ఉంటుంది. అయితే గ్రేట్ వైట్ షార్క్ మెగాలోడాన్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. శాస్త్రనిపుణుల ప్రకారం ఈ రెండు వేరు వేరు జాతులకు చెందనవి అని చెబుతున్నారు. మెగాలోడాన్ అంతరించిపోయిన ఒటో దాట్ నో జాతివి. గ్రేట్ వైట్స్ లాందండో కుటుంబాన్నికి చెందినవి. గ్రేట్ వైట్స్ కారణంగానే మెగాలోడన్ అంతరించిపోయని నిపుణులు చెబుతున్నారు. కానీ 2014 జనవరి 19న నాసా శాస్త్రవేత్తలకు సముద్రంలో కూడా ఒక అద్భుతమైనది కనిపించి భయపెట్టింది. నాసా పంపించిన ఆక్వా సాటిలైట్ బ్రెజిల్ దక్షిణ ఆగ్నేయ తీర ప్రాంతంలోని సౌత ఈస్ట్ కోస్ట్ ఆఫ్ బ్రెజిల్‌లో దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఫొటోని క్లిక్ చేసింది. మహాసముద్రంలోని 800 కిలోమీటర్ల చీకటి ప్రాంతంలో సాటిలైట్ తీసి ఈ ఫొటోతో నాసా శాస్త్రవేత్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. మొదట సముద్రంలో చాలా దూరం విస్తరించిన సూక్ష్మ జీవి అని అనుకున్నారు. ఆ తరువాత శాస్త్రవేతలు పరిశోధన చేయగా ఇవి షార్క్ కంటే పెద్దగా కనిపించింది. ఫొటోలో ఉండే షార్క్ దాదాపు 70 అడుగుల పొడవు ఉంది. ఇప్పుడు వారు చూసిన షార్క్ 30 లక్షల సంవత్సరాల క్రితమే ఇది అంతరించిపోయింది. అలాంటి షార్క్ ఇప్పుడు ఎలా వచ్చింది అని షాక్ అయ్యారు.
ఈ 70 అడుగుల పొడవు ఉన్న షార్క్ పేరు మెగాలోడాన్. ఇప్పటికి 30 లక్షల సంవత్సరాల క్రితం మెగాలోడాన్ షార్క్ సముద్రంలో రాజ్యమేలింది. ఇప్పుడు ఉన్నన షార్క్‌ల కంటే ఇది అత్యంత పొడవైంది, పెద్దది కూడా. ఇది 19 నుంచి 20 అడుగుల వెడల్పు ఉంటుంది. 60 అడుగుల పొడవైన ఈ షార్క్ దవడ మూడు మీటర్ల పెద్దదిగా ఉంటుంది. మెగాలోడాన్ నోటిలో 270 పదునైన దంతాలు ఉంటాయి. ఒక్కో దంతం మూడు నుంచి ఏడు అంగుళాలు ఉంటాయి. ఈ షార్క్‌లో ఆస్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా మనిషికి దంతాలు ఊడిపోతే రెండు సార్లు తిరిగి వస్తాయి. కానీ మెగాలోడాన్ షార్క్‌కు మాత్రం దంతాలను కోల్పోతే కేవలం ఐదు నుంచి ఏడు రోజులలోపే తిరిగి వస్తాయి. ఈ మెగాలోడాన్ షార్క్ బరువు 100 టన్నుల పైనే ఉంటుంది. ఇది ప్రతిరోజు ఒక టన్ను ఆహారాన్ని తింటుంది. అంతేకాకుండా అప్పుడే పుట్టిన పిల్ల మెగాలోడాన్ కూడా ఒక టన్ను బరువు ఉంటుంది. సముద్రంలో నివసించే ఏ జాతి కూడా ఈ మెగాలోడాన్ షార్క్‌కి ఎదురు తిరగదు. అయితే 30 లక్షల సంవత్సరాల క్రితం ఇవి కనుమరుగు అయ్యాయి. కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ మెగాలోడాన్ కనుమరుగు అవ్వడానికి కారణం భూమి నుంచి చాలా దూరంలో ఒక సూపర్ నోవా విస్పోటనం ఏర్పడిందని దాని వల్ల విడుదలైన శక్తి కారణంగా భూమి మీద వాతావరణం అస్తవ్యవస్తంగా మారిందని చెప్పారు. దీని వల్ల ఈ షార్క్‌లు అంతరించాయని చెప్పారు. అయితే అవి అంతర్దానం అయ్యాయని మనం భ్రమపడుతున్నామా? నిపుణుల అంచనా ప్రకారం ఎక్కడో సముద్ర గర్భంలో ఈ మెగాలోడన్ ఉండే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Viral Video: ఓర్ని.. వీడేంట్రా నాయన.. బెడ్ మీద అనకొండతో రోమాన్స్..?.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.