ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హీరో అయ్యాడు. ముంబైలోని కమల మిల్స్ అగ్ని ప్రమాదం దుర్ఘటనలో తన ప్రాణాలని లెక్కచేయకుండా అగ్నికి ఆహుతవుతున్న భవనంలోకి ప్రవేశించడమే కాకుండా అందులో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించడం కోసం మూడుసార్లు ఏడు అంతస్తులు ఎక్కిదిగాడు. భవనంలో పై అంతస్తుల్లో మంటల్లో చిక్కుకుని చావు బతుకుల మధ్య వున్న ముగ్గురిని ఇదిగో ఇలాగే అమాంతం తన భుజాలపై ఎత్తుకుని కిందికి తీసుకొచ్చి వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించేందుకు కావాల్సిన సహాయం చేశాడు. అగ్ని ప్రమాదం బాధితులని రక్షించడం కోసం అతడు చేసిన కృషి, అతడి శ్రమ ఇదిగో ఇలా ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Nothing can compensate the loss of lives in the #KamlaMillsFire but PC Sudarshan Shinde’s efforts to evacuate victims & save lives, deserves being commended. Our prayers are always with the grieving families. pic.twitter.com/tEhTYsTnl3
— CP Mumbai Police (@CPMumbaiPolice) January 1, 2018
సోషల్ మీడియా హీరోగా మారిన తమ పోలీసు కానిస్టేబుల్‌ని ఏకంగా ముంబై పోలీసు కమిషనర్ సన్మానించి సత్కరించారు. 'అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి లోటు పూడ్చలేనిది కానీ అగ్ని ప్రమాదం బాధితులని రక్షించేందుకు కానిస్టేబుల్ సుదర్శన్ షిండే చేసిన కృషి మాత్రం అభినందించదగినది' అని ముంబై పోలీసు కమిషనర్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొనడం విశేషం.