Snake Catcher Vava Suresh Caught Big King Cobra easily easily: ఈ భూ ప్రపంచంలో రకరకాల జాతులకు చెందిన పాములు ఉన్నాయి. 3000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నట్లు పలు నివేదికలు చెపుతున్నాయి. అన్నింటిలోకెల్లా 'కింగ్ కోబ్రా' అత్యంత ప్రమాదకరమైనది. కింగ్ కోబ్రా చిమ్మించే విషం చాలా విషపూరితమైనవి. అది ఒక్కసారి కాటేసిందంటే.. మనిషే కాదు బలమైన ఏనుగు కూడా నిమిషాల్లో చనిపోతుంది. అందుకే చాలా మంది కింగ్ కోబ్రా అంటే హడలిపోతారు. అయితే కింగ్ కోబ్రాలతో కూడా ఆడుకునేవారు కూడా ఈ ప్రపంచంలో కొందరు ఉన్నార. అందులో వావ సురేష్ ఒకడు.
వావ సురేష్ స్నేక్ క్యాచర్‌గా కేరళలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ పామును అయినా చాలా సులువుగా పట్టుకుంటాడు. అతను ఇప్పటికే 50000 కంటే ఎక్కువ పాములను పట్టుకుని రక్షించాడు. అందులో దాదాపుగా 200 కింగ్ కోబ్రాలు ఉన్నాయి. అంతరించిపోతున్న పలు జాతుల పాములను రక్షించడం కోసమే.. జనావాసాల్లోకి వచ్చిన పాములను సురేష్ రక్షిస్తుంటాడు. ఈ క్రమంలో ఎన్నో పాములు అతడ్ని కాటేసినా.. వెనక్కి తగ్గలేదు.
స్నేక్ క్యాచర్ వావ సురేష్ ఓ కింగ్ కోబ్రాను చాలా సులువుగా పట్టాడు. ఇది తాను పట్టుకున్న 169వ కింగ్ కోబ్రా అని చెప్పాడు. ఓ భారీ కింగ్ కోబ్రా ఊరి పరిసరాల్లోకి రాగా.. అక్కడికి సురేష్ వస్తాడు. ఉత్త చేతులతోనే పాము ఉన్న దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుంటాడు. అది కాటేయడానికి ప్రయత్నించగా తన టెక్నీక్ ఉపయోగించి. దాన్నుంచి తప్పించుకుంటాడు. చివరకు భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా. వీడియో చూసిన నెటిజన్లు 'వీడు మగాడ్రా బుజ్జి' అని కామెంట్స్ చేస్తున్నారు.
కింగ్ కోబ్రా ఒక విషపూరిత జాతికి చెందినది. ఇది ఎక్కువగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో ఉంటాయి. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. దీని సగటు పొడవు 10 నుండి 13 అడుగుల వరకు ఉంటుంది. 18 అడుగుల అతిపెద్ద కింగ్ కోబ్రా థాయ్‌లాండ్‌లోని ఓ జూలో ఉంది. ఇలాంటి పాములను పెట్టుకోవడానికి ఎవరూ కూడా ప్రయత్నించొద్దు. ఎన్నో ఏళ్లు పాములు పట్టడంలో శిక్షణ ఉన్నవారే దీనిని అదుపు చేయగలరు.
Also Read: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పడగవిప్పి బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రాను కిస్ చేసిన వ్యక్తి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook