Bigg Boss Vasanthi PR Team : పీఆర్ టీం గురించి బయటకు చెప్పేసింది.. బిగ్ బాస్ వాసంతి ఎమోషనల్ పోస్ట్

Bigg Boss Vasanthi PR Team బిగ్ బాస్ షోలో వసంతి గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టడం, అందులో బాలాదిత్య, వాసంతి ఎలిమినేట్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 04:21 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకు వచ్చిన వాసంతి
  • పీఆర్ టీం గురించ చెప్పిన బిగ్ బాస్ వాసంతి
  • వాసంతి ఎమోషన్ పోస్ట్ వైరల్
Bigg Boss Vasanthi PR Team : పీఆర్ టీం గురించి బయటకు చెప్పేసింది.. బిగ్ బాస్ వాసంతి ఎమోషనల్ పోస్ట్

Bigg Boss Vasanthi PR Team : బిగ్ బాస్ ఇంటి నుంచి పదోవారంలో బయటకు వచ్చింది వాసంతి. బయటకు వచ్చిన తరువాత వాసంతి తనకు వచ్చిన ఇమేజ్, క్రేజ్ చూసి మురిసిపోయింది. తాజాగా వాసంతి తన సంతోషాన్ని అంతా కూడా పదాల రూపంలో మార్చింది. ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది. 'నా గుండె సంతోషంతో నిండిపోయింది.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా ఉంది.. నా టాలెంట్ చూపి ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు నాకు బిగ్ బాస్ ఎంతగానో ఉపయోగపడింది. మంచి అవకాశాన్ని ఇచ్చింది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేముందు సలహాలు, సూచనలు ఇచ్చిన నా ఫ్రెండ్, పీఆర్ మేనేజర్ విజయానంద్‌కు థాంక్స్. నేను బయట ఎలా ఉంటానో.. లోపల కూడా అలానే ఉండి ఆడేందుకు ప్రయత్నించాను.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan)

మన జీవితంలో ఉన్న కష్టాలను పాలద్రోలి సంతోషాన్ని పంచేందుకు ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు..రాజీ కూడా అలాంటి ఓ వ్యక్తే. నా ఈ బిగ్ బాస్ జర్నీ ఇంత వరకు రావడానికి ఆమె ప్రధాన కారణం. ఆమె ప్రోత్సాహంతోనే నేను ఇంత వరకు వచ్చాను. బిగ్ బాస్ టీం, నాగార్జున సర్‌కు రుణపడి ఉంటాను. నేను బాధల్లో ఉండి.. వెనకపడిపోతుంటే.. ఆయన నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. 

నా ఈ ప్రయాణాన్ని ఎంతో అందంగా మల్చిన నా తోటి కంటెస్టెంట్లకు థాంక్స్. కంటెస్టెంట్లందరూ కూడా ఎంతో మంచివారు.. గేమ్ పరంగా మా అందరికీ బేదాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ప్రతీ ఒక్కరూ మంచి వారే. నా ఫ్యాన్స్, ఫాలోవర్స్, శ్రేయోభిలాషులు, మీడియా స్నేహితులు, రివ్యూయర్లు, వీక్షకులు ఇలా అందరికీ థాంక్స్.  నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వారికి ప్రత్యేకంగా థాంక్స్.

మీరు ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రేమతో నా జీవితాంతం సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా ఏ స్థాయిలో ఉన్నా మీ ప్రేమ నాతోనే ఉంటుంది.. నా ఫ్యామిలీ లేకుంటే ఇదంతా నేను సాధించేదాన్ని కాదు.. మా అమ్మ, సోదరి నాకు అండగా నిలబడటం నా అదృష్టం. బిగ్ బాస్ జర్నీలో ప్రతీ సారి నా వెంటే ఉంటూ నాకు సపోర్ట్‌గా నిలిచారు' అంటూ ఇలా తన జర్నీ గురించి వాసంతి ఎమోషనల్ అయింది.

Also Read : Gaalodu Movie Review : గాలోడు రివ్యూ.. సుధీర్ మాస్ యాంగిల్

Also Read : Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News