Mystery Temples In India: మన భారతదేశ వ్యాప్తంగా అనేక రకాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. అందులో చాలా వరకు మన భారత వారసత్వానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీటిని చూసేందుకు వివిధ దేశాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. వీటిల్లో చాలా వరకు అందరికీ తెలిసినవే.. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం పురాతన ఆలయాల గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ గుడిల్లో ఉండే ప్రాముఖ్యత, విగ్రహాల విశిష్టత ఇప్పటికీ ఎవరికీ తెలియదు అంటే నమ్మశక్యంగా లేదు కదా.. అలాగే కొన్ని ఆలయాల్లో అనేక మిస్టరీలు కూడా ఉన్నాయి. అందులో మధ్యప్రదేశ్ ప్రాంతంలోని జబల్‌పూర్‌లో ఆలయం ఒకటి.. ఈ ఆలయంలో కాలిక అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం దసరా నవరాత్రుల్లో భాగంగా కీటకటలాడుతుంది. అయితే ఇందులో కొరువు తీరి ఉన్న అమ్మవారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదేంటో అమ్మవారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఇక్కడ ఉన్న అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే.. గుడి నిండా ఏసీలు ఉంటాయట అయితే ఏసీలను ఆపేస్తే అమ్మవారి దేహానికి చెమటలు పడతాయట. చాలామంది ఈ ఘటనను అద్భుతమైనదిగా భావిస్తారు. అలాగే కొంతమంది సైన్స్ తెలిసినవారు ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని నమ్ముతూ ఉంటారు. ఇంకొందరైతే ఆలయంలో తేమ పరిమాణాలు ఉండడం కారణంగానే ఇలా చెమటలు పడుతున్నాయని భావిస్తారు. అయితే దీనికి సంబంధించిన అసలు కారణమైనది చాలామందికి ఎప్పుడు కొషన్ మార్కే.. కానీ స్థానికులు మాత్రం ఇది అమ్మవారి శక్తి స్వరూపమేనని గట్టిగా నమ్ముతారు. నిజానికి ఇలా అమ్మవారికి చెమటలు పట్టడం సంఘటనలు చాలా అరుదు అని మరి కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆలయంలోని అమ్మవారు రాయితో చెక్కబడడం.. అక్కడి ప్రాంతంలోని తేమ ఉండడం వల్లే ఇలా అమ్మవారికి చెమటలు పడుతున్నాయని ఇటీవల కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చెమటలు పట్టడం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనేది తెలియకుండా అందర్నీ ఆశ్చర్యానికి గురిస్తున్నాయి. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, సోమవారాలు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతూ ఉంటారు. వారి మొక్కలు చెల్లించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తారు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇక్కడ ఎవరు ఎలాంటి కోరికలు కోరుకున్న సులభంగా నెరవేరుతాయట.
అంతేకాకుండా ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. దీని కారణంగా దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజులపాటు ఘనంగా అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారని అక్కడి ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆలయం త్వరలోనే దేవాదాయ శాఖ పరిధిలోకి చేరే అవకాశాలున్నాయి. దీనివల్ల అక్కడ టూరిజం పెరిగే ఛాన్స్ ఉందని కొంతమంది స్థానికులు అంటున్నారు. నిజానికి ఇలా మిస్టరీ ఉన్న దేవాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.