Netizens trolling sonu sood for supporting chapati vendor: రియల్ హీరో సోనూసూద్ కరోనా సమయంలో అనేక మందిని ఆదుకున్నారు. తన సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లలో, విమానాల్లో వారి వారి స్వగ్రామాలకు వెళ్లేలా చేశారు. కరోనాతో బాధపడుతున్నవారికి కిట్ లు అందించారు. ఆక్సిజన్ మాస్క్ లను అందించారు. ఎందరికో నిత్యవాసరాల సహాయం కూడా చేశారు. ఎవరు సోషల్ మీడియా వేదికగా సహాయం కావాలన్న.. నేనున్నాంటూ కూడా సూపర్ మ్యాన్ లా సహాయం చేశారు. ఆయన అనేక మందికి తీవ్రమైన వ్యాధులబారిన పడిన వారికి మెడికల్ ట్రీట్మెంట్ లను తన సొంత ఖర్చులతో చేయించారు. అంతేకాకుండా..ఉన్నత చదువుల కోసం డబ్బులు లేవంటే వారికి కూడా సహాయం చేశారు. ఇటీవల ఏపీలోని యువతికి సైతం.. ఉన్నత చదువుల కోసం సహాయం చేశారు. కానీ ఆయన ప్రస్తుతం చేసిన ఒక పనితో వివాదంలో ఇరుక్కున్నారు. నెటిజన్లు ఆయనను ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
थूक लगाई रोटी "सोनू सूद" को “पार्सल” की जाये, ताकि भाईचारा बना रहे ! https://t.co/e3mghsFgkG pic.twitter.com/ANcE6yquTJ
— Sudhir Mishra 🇮🇳 (@Sudhir_mish) July 19, 2024
ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని హరిద్వార్ లో కన్వర్ యాత్ర నేపథ్యంలో పోలీసులు అక్కడ తప్పనిసరిగా దుకాణా దారుల యజమానులతో బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.దీంతో అక్కడి వారు దీన్ని వ్యతిరేకించారు. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఆదేశాలను సైతం వెనక్కు తీసుకొవాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సోనూసూద్ చేసిన ట్విట్ ఇప్పుడు వివాదాన్ని రాజేసింది.
కన్వర్ యాత్ర ఘటనపై సోనూసూద్.. మానవత్వం అనే బోర్డులను దుకాణాల ముందు పెట్టాలని ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. దీనికి కౌంటర్ గా ఒక నెటిజన్.. ఒక వీడియోను ఆయనకు షేర్ చేశాడు. అందులో ఒక వ్యక్తి చపాతీల మీద ఉమ్మివేస్తున్నాడు. దీనికి సోనూ రాముడికి శబరి ఒక ఎంగిలి పండ్లు తినిపించిందని అంశంగురించి రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు.. సోనూసూద్ కు దిమ్మతిరిగే విధంగా. ఆ ఉమ్మివేసిన చపాతీలను సోనూకు పంపాలని కూడా ట్రోల్స్ చేయడంప్రారంభించారు.
సోనూసూద్ సైతం..రాముడే ఎంగిలి పండ్లను తినగాలేనిది మనం తినలేమా అని బదులిస్తాడు.. దీంతో ఒక నెటిజన్ ఫైర్ అయ్యి.. ‘‘శబరి మాతా రామయ్య భక్తురాలు. ఆమె ఏనాడు కూడా ద్వేషంతో పండ్లను ఎంగిలి చేసి ఇవ్వలేదు. కేవలం.. అవి రుచికరంగా ఉన్నాయా? లేదా? అని మాత్రమే టెస్ట్ చేసింది. ఆమె భక్తికి రాముడు పొంగిపోయాడు. కానీ ఇక్కడ వీడియోలో..మాత్రం సదరువ్యక్తి కస్టమర్ల మీద కోపంతో చపాతీల మీద ఉమ్ముతున్నాడు. ఒక వర్గం మీద ద్వేషంతో ఇలా చేస్తున్నారు. అయినా.. శబరీని, వీరితో పొలుస్తున్నావు.. నువ్వోక మూర్ఖుడివి అంటూ కూడా ఏకీపారేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి