Wedding Video: అయ్ పాయ్.. పెళ్లిలో వరుడి పరువు గోవిందా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫన్నీ వీడియో..

Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 8, 2025, 09:44 AM IST
  • పెళ్లిలో వెరైటీ ఘటన..
  • పడి పడి నవ్విన అతిథులు..
Wedding Video: అయ్ పాయ్.. పెళ్లిలో వరుడి పరువు గోవిందా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫన్నీ వీడియో..

Pheras ceremony in wedding funny video: సాధారణంగా సోషల్ మీడియాలో డైలీ వందకు పైగా వీడియోలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా ఫన్నీ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా, పెళ్లిలో జరిగే ఫన్నీ థింగ్స్ వల్ల ఆ పెళ్లిళ్లు వార్తలలో ఉంటాయి. మరీ కొందరు కావాలని చేస్తారో లేదా పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ.. కొన్ని పెళ్లిళ్లు అదే పనిగా వైరల్ అవుతుంటాయి . ఇటీవల పెళ్లిలో వధువు, వరుడు వెరైటీగా ఎంట్రీ ఇవ్వడం, పీటల మీద పెళ్లి ఆగిపోవడం, మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు ఎంట్రీ ఇవ్వడం వంటి ఘటనలు చూశాం.

 

అంతే కాకుండా.. పెళ్లిలో తరచుగా  గొడవలు పడటం, పెళ్లిలో వరుడికి బట్టతల లేదా ఇంగ్లీష్ రాలేదని.. వధువు పెళ్లి క్యాన్షిల్ చేసుకుని వెళ్లిపోయిన ఘటనలు కూడా బోలేడు వైరల్ అయ్యాయి. అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. వేదిక మీద పెళ్లి తంతు జరుగుతుంది. ఇంతలో హోమం చుట్టు కొత్త జంట ఏడడుగులు వేస్తున్నారు. అప్పుడు.. వరుడి వెనుకాల వధువు వెళ్తుంది.

మరీ  పెళ్లిలో సాధారణంగా పట్టు పంచ వేసుకుంటారు. కొంత మందికి వేసుకొవడం అలవాటు లేక.. పెళ్లిలో తెగ ఇబ్బందులు పెడుతుంది. తరచుగా ధోతీ జారీపోతు ఉంటుంది. అచ్చం ఇలాంటి ఘటన ఇక్కడ జరిగింది. వరుడు వేసుకున్న ధోతీ అంచు మీద వధువు కాలు పెట్టినట్లు ఉంది. ఈ క్రమంలో అది వెంటనే జారీపోయింది. కానీ వరుడు మాత్రం..వెంటనే తన ధోతీని వేసుకుని కవర్ చేసుకున్నాడు.

Read more: Viral Video: నువ్వు తోపు భయ్యా.. వట్టి చేతులతో చిరుతకే చెమటలు పట్టించాడుగా.. వీడియో వైరల్..

 దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా ఫన్నీగా నవ్వేశారు. వధువు కూడా.. తన భర్తను చూసి ఫన్నీగా నవ్వినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం పడి పడి నవ్వుతున్నారంట. మరికొందరు లోపల ఇన్నర్ ఉంది భయ్యా..లేకుంటే.. ఏంజరిగేదో.. అంటూ సెటైర్ లు వేస్తున్నారంట.  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News