Snake Catcher Murliwale Hausla saves Big Python life: ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ భారీ కొండచిలువ ఊహించని ఆపదలో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా పరిసరాల్లో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువ.. భారీ ఉడుమును మింగేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి కదల్లేక పంటపొలాల్లో తీవ్ర ఇబ్బందులు పడింది. జనావాసంలో నుంచి అడవిలోకి వెళ్లలేక అవస్థలు పడుతున్న ఆ కొండచిలువను డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మురళీవాలే హౌస్లా పట్టుకుని అడవిలోకి వదిలాడు.
ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ భారీ కొండచిలువ జౌన్‌పూర్ జిల్లా పరిసరాల్లో ఓ భారీ ఉడుమును మింగేసింది. దాంతో తీవ్ర ఇబ్బందులు పడిన ఆ కొండచిలువ పంటపొలాల్లోని రంద్రంలో దాక్కుంది. ఆ పొలం యజమాని ఇది గమనించి.. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లాకి సమాచారం ఇచ్చాడు. మురళీ వెంటనే ఆ పంటపొలం వద్దకు వచ్చి.. కొండచిలువ తోక పట్టుకుని బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అది మాత్రం రంద్రం నుంచి బయటకు రాదు. దాంతో పాము ఉన్న ప్రాంతంను శుభ్రపరిచి.. మరోసారి దాని తోక పట్టుకుని లాగగా బయటకు వస్తుంది.
పొలం లోంచి ఖాళీ ప్రదేశంలో పడేయగానే ఆ కొండచిలువ మింగేసిన ఉడుమును బయటకు కక్కడానికి ప్రయత్నిస్తుంది. చాలా సమయం తర్వాత ఉడుమును మొత్తం కక్కి.. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా పట్టుకుంటాడు. ఇంతలో వర్షం మొదలవడంతో ఆ కొండచిలువ ఓ ఇంటికి తీసుకెళ్లి సంచిలో వేసి బంధిస్తాడు. ఆపై దాన్ని అడవిలో వదిలేస్తాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొదువుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: సైమా అవార్డ్స్ 2022లో మెరిసిన పూజా హెగ్డే.. 'మేడమ్ సర్ మేడమ్ అంతే'..!
Also Read: ఇదేం ఫీల్డింగ్ రా సామీ.. సింపుల్ క్యాచ్‌ను సిక్సర్ ఇచ్చారుగా! పాక్ ఫీల్డర్స్‌తో అట్లుంటది మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook