Rare Golden King Cobra Snake Video Watch Now Here: సోషల్ మీడియా వేదికగా మనం ఎన్నో పాములను తరచుగా చూస్తూ ఉంటాం. చిన్న పాముల నుంచి పెద్ద కింగ్ కోబ్రాల వరకు అనేక పాములకు సంబంధించిన వీడియోలు చూశాం.. కానీ ఇటీవల వైరల్ అవుతున్న ఓ పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారుల చూపు తిప్పుకోకుండా చేసింది. మిలమిలా మెరుస్తున్న పాము ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో పాము ఏ విధంగా ఉందో? అసలు సోషల్ మీడియాలో ఇంత చక్కర్లు కొట్టడానికి కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
మనం తరచుగా అనేక రకాల పాములను చూసి ఉంటాం. అందులో కొన్ని ప్రజలను భయాందోళనలకు గురి చేసే వైతే.. మరికొన్ని మాత్రం చాలా క్యూట్ గా ఉండి ఎలాంటి హాని కలిగించకుండా రోడ్డుమీద అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటి రెండిటికీ చాలా భిన్నంగా ఉంది. ఇప్పటికీ ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగుతో కూడిన పాములను వీడియోలో చూసి చూసి ఉన్నాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పాము ఏకంగా బంగారు రంగులో ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పాము ప్రస్తుతం నెటిజన్స్ను వారి చూపు వేరే ఇతర వీడియోలకు వెళ్లకుండా చేస్తోంది. ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు కనిపించడం చాలా అరుదే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే.. వీడియోలో మీరు ఆ గోల్డెన్ కలర్ పాము తన పుట్టలో నుంచి బయటికి రావడం చూడవచ్చు. అయితే ఆ పాము నెమ్మదిగా తన తోకను పుట్టలో నుంచి తీసి ఆ తర్వాత తలను బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే ఆ పాముకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసి.. సౌండ్స్ రావడంతో అక్కడి నుంచి పొదల్లోకి ఎంతో స్పీడుగా వెళ్తుంది. అంతేకాకుండా ఆ పాము వెళ్లే క్రమంలో ఏమాత్రం చప్పుడు లేకుండా వెంటనే స్పీడ్ గా వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలా పాములు మనిషి వినికి వినిపియ్యగానే దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం శబ్దం వినబడగానే ఎంతో స్పీడుగా పారిపోవడం మీరు చూడవచ్చు.
ప్రస్తుతం ఈ గోల్డెన్ కలర్ కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియోను మాయ రాజు బ్లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో షార్ట్ కింద తయారు చేసి షేర్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఈ వీడియో 30 సెకండ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోకు క్యాప్షన్ గా గోల్డెన్ స్నేక్ అని పెట్టి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ దృశ్యాలను కొన్ని వేల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ అయితే ఇలాంటి పాములను చాలా అరుదుగా చూస్తామని అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.