బ్రిటిష్ లగ్జరీ ఆటోమొబైల్స్ మేకర్ అయిన రోల్స్ రాయ్స్ ( Rolls-Royce ) ఇటీవలే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ ప్లేన్ టెస్టును పూర్తి చేసింది. రోల్స్ రాయిస్ తెలిపిన వివరాల ప్రకారం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో తో తయారు అయిన ఈ రెప్లికా ( డూప్లికేట్ వర్షన్ ) ప్లెయిన్ ను అన్ని రాకాలు గా పరీక్షించారు. దీని పేరు ఇయాన్ బర్డ్ (IonBird ) అని తెలిసింది.
ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?
ఈ ప్లేన్ కోర్ లో 500 హార్స్ పవర్ ఎలెక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఉంటుంది. ఇది ప్రపంచ రికార్డులను బ్రేక్ చేయగలదు.ప్లేన్ పరీక్షను నిర్వహించడానికి వినియోగించిన బ్యాటరీతో 250 ఇళ్లకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయవచ్చు. రోల్స్ రాయ్స్ ప్రారంభించిన ACCEL అనే కార్యక్రమంలో దీన్ని తయారు చేశారు. ACCEL అంటే యాక్సిలెరేటింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ అని అర్థం వస్తుంది.
ACCEL ప్రాజెక్టును రోల్స్ రాయ్స్ YASA అనే ఎలక్ట్రిక్ మోటార్ అండ్ కంట్రోల్లెర్ మాన్యుఫాక్చరర్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. యూకే ప్రభుత్వం (United Kingdom ) తెలిపిన అన్ని సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటిస్తూ అన్ని ఆధునిక హంగులు ఉన్న ఎలక్ట్రిక్ ప్లేన్ ను రోల్స్ రాయ్స్ సిద్ధం చేసింది. తమ స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్లాన్ లో దీన్ని కీలకంగా భావిస్తున్నట్టు తెలిపింది సంస్థ. పర్యావరణ కాలుష్యం కలిగించకుండా భవిష్యత్తు ప్రయాణాలను వీలు కల్పించడంమే లక్ష్యం అని సంస్థ తెలిపింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR