Mysterious Fish: ఇదేందయ్యో ఇది.. ఈ చేప ఇట్లా ఉంది! నరకం నుంచి ఊడిపడిందా ఏంది

Mysterious Fish found in Russian Sea. సముద్రపు లోతుల్లోని రహస్య విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ 3,600 అడుగుల కిందకు వెళ్లే రష్యా మత్స్యకారుడికి మిస్టీరియస్ ఫిష్ కనిపించింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 12:29 PM IST
  • స‌ముద్రంలో ఫోటోగ్రాఫర్‌కి వింత జీవి
  • ఇదేందయ్యో ఇది.. ఈ చేప ఇట్లా ఉంది
  • నరకం నుంచి ఊడిపడిందా ఏంది ఈ చేప
 Mysterious Fish: ఇదేందయ్యో ఇది.. ఈ చేప ఇట్లా ఉంది! నరకం నుంచి ఊడిపడిందా ఏంది

Russian Fisherman Captures Mysterious Fish in Sea: స‌ముద్రంలో మిలియన్ల ర‌కాల జీవ రాశులు నివ‌సిస్తాయి. అందులో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి. మ‌న‌కు తెలిసిన‌వి కొన్ని ర‌కాల మాత్ర‌మే కానీ.. స‌ముద్రంలో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో జీవులు నివ‌సిస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వింత జీవులు మ‌నుషుల‌కు క‌నిపిస్తూ ఉంటాయి. అప్పుడు కానీ తెలియ‌దు స‌ముద్రంలో ఇటువంటి వింత జీవులు కూడా ఉంటాయ‌ని. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్‌కి వింత జీవి క‌నిపించింది. వెంటనే దాన్ని కెమెరాలో బంధించాడు. 

రష్యాకు చెందిన రోమన్ ఫెడోర్ట్సోవ్ అనే వ్యక్తి మత్స్యకారుడు మాత్రమే కాకూండా ఫోటోగ్రాఫర్ కూడా. మర్మాన్స్క్‌లో నివసిస్తున్న 39 ఏళ్ల  ఫెడోర్ట్సోవ్ నిత్యం సముద్రంలో తిరుగుతూ రహస్యమైన విషయాలను సేకరించేందుకు ఇష్టపడతాడు. సముద్రపు లోతుల్లోని రహస్య విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ 3,600 అడుగుల కిందకు వెళతాడు. తాజాగా అలా వెళ్లిన అతడికి ఓ వింత చేప కనిపించింది. ఫోటోగ్రాఫర్ అయిన ఫెడోర్ట్సోవ్.. ఆ వింత చేపను తన కెమెరాలో బంధించాడు. 

వింత చేప పోటోలను రోమన్ ఫెడోర్ట్సోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. 'ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఇలాంటి చేపను చూడలేదు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. మీరూ కూడా' అంటూ పేర్కొన్నాడు. ఈ చేప ఏమిటో, దాని పేరు ఏమిటో స్పష్టంగా తెలియలేదన్నాడు. అయితే పసుపు కనుపాప, బయటకు వచ్చిన నాలుక మరియు నోటి నుంచి బయటకు వచ్చిన పళ్లు ఖచ్చితంగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని వివరించాడు. దీన్ని చుసిన వారు 'ఇది అరుదైన రకం గురూ!', 'నరకం నుంచి ఊడిపడిందా?', 'కాలుష్యం వల్ల ఇలా ఉందా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదివరకు బ్రెజిల్‌లోని ఓ మ‌త్స్య‌కారుడికి వింత జీవి స‌ముద్రంలో క‌నిపించింది. క‌నిపించ‌డ‌మే కాదు అది అత‌డిని వెంటాడింది. స‌ముద్రంలో వేట‌కు వెళ్లిన మ‌త్స్య‌కారుడి బోటును ఆ వింత జీవి వెంటాడింది. నీళ్ల మీద ఎగురుతూ.. ఆ బోటును వేటాడింది. అది నీళ్ల‌లో నుంచి పైకి లేచిన‌ప్పుడు దాని క‌ళ్లు మెరుస్తూ ఉన్నాయి. ఇంత‌కీ అది ఏ జీవి అనేది మాత్రం ఎవరూ క‌నిపెట్ట‌లేక‌పోయారు. అప్పుడు వింత జీవి ఛేజింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Also Read: Rohit Sharma: జస్ప్రీత్ బుమ్రా అద్భుతం కానీ.. ముంబై ఓటమి అనంతరం రోహిత్ శర్మ ఏమ్మన్నాడంటే?

Also Read: India Covid 19 Cases: తగ్గిన కరోనా కొత్త కేసులు.. ఈరోజు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News