Snake Nagamani Stone: నాగుపాము తలను కోసి.. 'నాగమణి'ని తీసిన వ్యక్తి! నమ్మకం లేకుంటే వీడియో చూడండి

Man cut King Cobra head and took out Nagamani stone. ఓ వ్యక్తి నాగుపాము తల నుంచి నాగమణిని బయటికి తీశాడు. అది నిజంగా నాగమణా కాదో తెలియదు కానీ.. ఓ వీడీయో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 21, 2022, 03:37 PM IST
  • నాగుపాము తలను కోసి
  • 'నాగమణి'ని తీసిన వ్యక్తి
  • నమ్మకం లేకుంటే వీడియో చూడండి
Snake Nagamani Stone: నాగుపాము తలను కోసి.. 'నాగమణి'ని తీసిన వ్యక్తి! నమ్మకం లేకుంటే వీడియో చూడండి

Man cut King Cobra head and took out Nagamani pearl: నాగమణి.. చాలామంది ప్రజలు ఈ పేరును చాలాసార్లు వినే ఉంటారు. నాగుపాము తలపై 'రత్నం' ఉంటుందని.. దానినే 'నాగమణి' అని అంటారని పెద్దలు చెబుతుంటారు. నాగమణికి సంబంధించి అనేక కథలు మనం పుస్తకాల్లో, సినిమాల్లో చూశాం. అయితే నిజం ఏంటనేది మాత్రం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది నాగమణి ఉందని నమ్మితే, మరికొందరు మాత్రం నాగమణి లేదని అంటుంటారు. అయితే ఓ వ్యక్తి నాగుపాము తల నుంచి నాగమణిని బయటికి తీశాడు. అది నిజంగా నాగమణా కాదో తెలియదు కానీ.. ఓ వీడీయో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియో ప్రకారం... పొలాల మధ్య ఉన్న ఓ మట్టి రోడ్డులో నాగుపాము ఉంటుంది. దాన్ని ఓ పెద్ద వయస్కుడు తన చేతిలో ఉన్న టవల్‌లో కంట్రోల్ చేస్తాడు. ఆ వ్యక్తి ముందుకు నడుస్తూ ఉంటే.. పాము పాడగా విప్పి వెనకాలకు వెళుతూ ఉంటుంది. పాము రోడ్డు దాటి పొలాల్లోకి పోయేందుకు ప్రయత్నించగా.. అతడు తోకను పట్టుకుని రొడ్డిపైకి తెస్తాడు. ఈ క్రమంలో నాగుపాము ఆ వ్యక్తిని కాటువేసేందుకు ప్రయత్నించగా.. తెలివిగా తప్పించుకుంటాడు. 

చివరకు నాగుపామును పట్టుకున్న ఆ వ్యక్తి.. దాని తలపై షాకుతో కోస్తాడు. చిన్నసైజు రత్నం లాంటిది బయటికి వస్తుంది. ఆపై ఆ నాగుపామును అతడు వదిలేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఇది నిజంగా నాగమణి ఏనా అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకి 11,165,908 వ్యూస్ వచ్చాయి. 

వరాహ మిహిరుడు రచించిన బృహత్‌సంహిత ప్రకారం.. నాగమణి ఒక కల్పితం కాదట. ఇది పాము తలపై ఉంటుందని పేర్కొన్నారు. నాగమణి కలిగిన పాములు చాలా అరుదుగా ఉంటాయట. నాగమణి ఉన్న పాము చాలా ప్రకాశవంతంగా ఉంటుందని వరాహ మిహిరుడు చెప్పారు. ఆ పాము నుంచి వెలువడే కాంతి ఒక అగ్నిలా వెలుతురును ఇస్తుందట. పాము ఉన్న ప్రాంతం అంతా ప్రకాశవంతంగా కనిపిస్తుందని వరాహ మిహిరుడు చెప్పుకొచ్చారు.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. వీయూ 43 ఇంచ్ టీవీపై 42 శాతం తగ్గింపు!

Also Read: Muslim Couple TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన ముస్లిం జంట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News